Tollywood Heroes : ఈ మధ్య కాలంలో సైలెంట్ అయిన టాలీవుడ్ హీరోలు వీళ్లే.. కొత్త ప్రాజెక్ట్ ల ప్రకటన ఎప్పుడంటూ?

మాములుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొన్ని సినిమాలలో అవి సక్సెస్ అవ్వక, సినిమా అవకాశాలు లేక మూవీస్ కి దూరం అవ్వడం లేదంటే కనపడకుండా పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి.అలా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు కనబడుతున్నారు.

 These Are Heroes Leave Movies Now Naga Shourya Allu Sirish Vaishnav Tej-TeluguStop.com

ఇటీవల కాలంలో సినిమాలలో నటించి ఆ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో మౌనంగా ఉండిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు.అలాంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ హీరోలు కూడా ఒకరు.

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్( Sushanth ) ఇప్పుడేం చేస్తున్నారో తెలియదు.

చాలా కాలంగా ఆయన పేరు వినిపించడం లేదు.

మనిషి కూడా కనిపించడం లేదు.మనిషి ఒడ్డు, పొడవు, అందం ఉన్నా కూడా హీరో నాగశౌర్య( Naga Shourya ) కూడా సైలంట్ గా వున్నారు.

సరైన కథలు లేక ఏవీ ఓకె అనడం లేదని తెలుస్తోంది.మంచి నటుడు అనిపించుకుని, మంచి హీరోగా మారే ప్రయత్నం చేసాడు సత్యదేవ్.

( Satyadev ) ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నారో తెలియదు.అంత సైలంట్ గా వున్నాడు సత్యదేవ్.

అలాగే వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) ఆదికేశవ తరవాత కొత్త సినిమా ఏదీ అనౌన్స్ చేయలేదు.ఏజెంట్ సినిమా తరువాత అక్కినేని అఖిల్( Akkineni Akhil ) సినిమా ఒకటి యువి సంస్థతో వుందని వార్తలు మాత్రం వున్నాయి.

కానీ దాని అతీ గతీ మాత్రం తెలియదు.బెల్లంకొండ చిన్న హీరో కూడా కథలు వింటున్నారు.

Telugu Akkineni Akhil, Allu Sirish, Naga Shourya, Rohith, Raj Tharun, Satyadev,

ఇదిగో అదిగో సినిమా అంటున్నారు తప్ప, ఏదీ మెటీరియలైజ్ అవుతున్న దాఖలాలు కనిపించడం లేదు.నారా రోహిత్( Nara Rohith ) ప్రతిధ్వని 2 అని ఓ సినిమా స్టార్ట్ చేసారు.కానీ ఇప్పుడు దాదాపు ఎన్నికల టైమ్ వచ్చేసినా ఆ సినిమా జాడ లేదు.మరో సినిమా చేస్తున్న దాఖలా లేదు.గీతా లాంటి అతి పెద్ద సంస్థ బ్యాకింగ్ వుండి కూడా అల్లు శిరీష్( Allu Sirish ) ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో తెలియదు.సినిమా అయితే ఏదీ ప్లానింగ్ లో వున్నట్లు లేదు.

రాజ్ తరుణ్( Raj Tharun ) ఒక మంచి హీరోగా చిన్న నిర్మాతలకు కలిసి వస్తాడని అందరు అనుకున్నారు.

Telugu Akkineni Akhil, Allu Sirish, Naga Shourya, Rohith, Raj Tharun, Satyadev,

కానీ అది అనుకున్న విధంగా వర్క్ ఔట్ కావడం లేదు.కీరవాణి తనయుడు సర్రున దూసుకువచ్చి రెండు, మూడు సినిమాలు చేసారు.అంతే ఆ తరువాత మళ్లీ సైలంట్ అయిపోయారు.

ఒక హిట్ తరువాత వచ్చిన ఒక డిజాస్టర్ టోటల్ గా పక్కన కూర్చో పెట్టేసింది అనుకోవాలేమో? ఇలా ఇంకా పలువురు హీరోలు కథలు సెట్ కావడం లేదనో, సరైన ప్రాజెక్ట్ లేదనో అలా వుండిపోయారు.కార్తికేయ గుమ్మకొండ మంచి సినిమాలు టేకప్ చేసారు.

కానీ సరైన ఫలితాలు రాలేదు.దాంతో ప్రస్తుతం ఆయన మాత్రం నిర్మాతలు ఎవరో ఒకరు దొరుకుతారు.

కానీ దర్శకులు, కథలు దొరకడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube