క‌రోనాను ఎదుర్కోవాలంటే..ఖ‌చ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే!

క‌రోనా వైర‌స్ త‌గ్గింద‌ని కాస్త ఊపిరి పీల్చుకునేలోపే మ‌ళ్లీ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు విశ్వ‌రూపం చూపిస్తోంది.ఫస్ట్ వేవ్ కంటే ఈ సెకండ్ వేవ్ లో క‌రోనా తాండవమాడుతోంది.

 These Are Best Fruits To Take During Corona! Best Fruits, Corona Virus, Covid-19-TeluguStop.com

ముఖ్యంగా మ‌న దేశంలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి.కేవ‌లం సామాన్యుల‌పైనే కాకుండా రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు, క్రీడా కారులు ఇలా అంద‌రిపై ఈ క‌రోనా పంజా విసురుతోంది.

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన ఈ క‌రోనాను ఎదుర్కోవాలంటే ఖ‌చ్చితంగా ప‌లు జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డంతో పాటు కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యంగా కొన్ని పండ్లు క‌రోనా నుంచి ర‌క్షించ‌డంలో ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ క‌రోనా టైమ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌తి రోజు తినాల్సిన పండ్ల‌లో దానిమ్మ పండు ఒక‌టి.

దానిమ్మ పండులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలప‌రుస్తాయి.మ‌రియు ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.

సో క‌రోనాను ఎదుర్కోవాలంటే రెగ్యుల‌ర్‌గా ఒక దానిమ్మ పండును తీసుకుంటే మంచిది.

అలాగే క్రాన్‌బెర్రీ పండ్ల‌ను కూడా ఈ క‌రోనా స‌మ‌యంలో ఖ‌చ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.చూసేందుకు చిన్నగా, గుండ్రంగా, ఎరుపు రంగులో ఉండే ఈ క్రాన్‌బెర్రీ పండ్లు మార్కెట్‌లో ఎప్పుడూ ల‌భిస్తాయి.క్రాన్‌బెర్రీ పండ్ల‌లో ఉండే కొన్ని ముఖ్య‌మైన పోష‌కాలుఇమ్యూనిటీ ప‌వ‌ర్‌ను పెంచుతాయి.

వ్యాధుల్ని, గాయాల్నీ నయం చేసే శక్తి ఈ క్రాన్‌బెర్రీ పండ్ల‌కు చాలా ఎక్కువ‌.రెగ్యుల‌ర్ ఈ పండ్ల‌ను డైరెక్టుగా తీసుకోవ‌డం లేదా సలాడ్లు, ఓట్స్ మీల్‌లో క‌లిపి తీసుకోవ‌డం చేస్తే మంచిది.

ఇక క‌రోనాను ఎదుర్కోవాలంటే.సిట్ర‌స్ పండ్ల‌ను కూడా త‌ప్ప‌కుండా తీసుకోవాలి.ముఖ్యంగా నిమ్మ‌, నారింజ‌, ద్రాక్ష‌ వంటి సిట్ర‌స్ పండ్ల‌ను తీసుకుంటే.అందులో ఉండే విట‌మిన్ సీ మ‌రియు ఇత‌ర పోష‌కాలు ఇన్ఫెక్ష‌న్లు, వైర‌స్‌లు ద‌రి చేర‌కుండా ర‌క్షించ‌డంలో అద్భుతంగా స‌మాయ‌ప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube