అద్దం పగిలితే అపశకునమా.. దీనికి పరిహార మార్గం ఇదే!

సాధారణంగా మనం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలతో పాటు మూఢనమ్మకాలను కూడా ఎక్కువగా నమ్ముతారు.ఈ క్రమంలోని ఏదైనా శుభకార్యాల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు శుభకార్యాలను ప్రారంభిస్తున్నప్పుడు కొన్ని రకాల పనులు జరిగితే వెంటనే వాటిని అపశకునంగా భావించి ఆ పని పూర్తయ్యే వరకు ఎంతో ఆందోళన చెందుతూ కనిపిస్తారు.

 These Are Bad Omen And Its Remedies Mirror, Bad Omen, Anjaneya Swamy, Break Mirr-TeluguStop.com

ఇలా ఏదైనా శుభకార్యాల నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు ఎవరైనా తుమ్మినా, పిల్లి ఎదురొచ్చిన, అద్దం పగిలిన అశుభంగా ప్రకటిస్తారు.

ఈ క్రమంలోనే ఇలాంటి కొన్ని సంఘటనలు జరిగినప్పుడు కొందరు ఎంతో ఆందోళనగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

అయితే మనం ఏదైనా శుభకార్యాల నిమిత్తం బయటకు వెళుతున్న సమయంలో పొరపాటున ఎవరైనా తుమ్మిన కాసేపు ఇంట్లో కూర్చొని ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకొని కొన్ని మంచి నీళ్ళు తాగి బయలుదేరాలి.అలాగే నల్ల పిల్లి ఎదురు వస్తే అశుభమని పరిగణిస్తారు ఇలా పిల్లి ఎదురు వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి స్తోత్రం పఠించాలి.

Telugu Anjaneya Swamy, Bad Omen, Break Mirror, Mirror-Telugu Bhakthi

మరికొన్ని సందర్భాలలో మనం ఏదైనా వివాహం శుభకార్యాల గురించి మాట్లాడే సమయంలో లేదా ముఖ్యమైన పనుల నిమిత్తం బయటకు వెళ్తున్నప్పుడు అద్దం పగిలిపోతుంది.ఇలా అద్దం పగిలిపోవడం వల్ల మనం వెళ్తున్న అటువంటి కార్యంలో ఒడిదుడుకులు ఎదురవుతాయని చాలామంది భావిస్తుంటారు.కానీ ఇలా అద్దం పగిలిన వెంటనే ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు.అద్దం పగిలిన విషయం మనకు తెలిస్తే కాసేపు ఇంట్లో కూర్చుని మన ఇష్టదైవాన్ని ప్రార్ధించుకోవాలి.

అలాగే ఆంజనేయస్వామి స్తోత్రాన్ని చదువుకొని అనంతరం బయటకు వెళ్లడంతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకొని రావచ్చని పలువురు చెబుతున్నారు.అయితే ఇవన్నీ కేవలం మన నమ్మకాలను మాత్రమేనని మనకు అపశకునంగా భావించే కొన్ని వస్తువులు కొందరికి ఎంతో శుభసూచకంగా భావిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube