అందరికీ ఎంతగానో ఉపయోగపడే 5 స్మార్ట్‌హోమ్ డివైజ్‌లు ఇవే!

స్మార్ట్ హోమ్ టెక్నాలజీ భారతదేశంలో బాగా పాపులర్ అవుతోంది.అనేక రకాల స్మార్ట్ హోమ్ డివైజ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

 These Are 5 Smart Home Devices That Are Very Useful For Everyone, Smart Home Tec-TeluguStop.com

ఈ డివైజ్‌లు అనేక రకాల ఫీచర్లు, సామర్థ్యాలను అందిస్తాయి.కొన్ని అత్యుత్తమ స్మార్ట్ హోమ్-కనెక్ట్ డివైజ్‌లలో ప్రస్తుతం ఐదు పరికరాలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి.

వాటిలో మొదటిది మోర్ఫీ రిచర్డ్స్ న్యూ యూరోపా కాఫీ మేకర్ .ఈ కాఫీ మేకర్‌ను లాట్, కాపుచినో, ఎస్ప్రెస్సో డ్రింక్స్ ప్రిపేర్చేయడానికి ఉపయోగించవచ్చు.ఈ డివైజ్ రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది.ఈ కాఫీ మేకర్ ధర రూ.5,795.

Telugu Philipsair, Smart-Latest News - Telugu

ఇంకో స్మార్ట్ హోమ్ డివైజ్ ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్.ఇది 90% వరకు తక్కువ కొవ్వుతో టేస్టీ ఫుడ్ వండుకోవడానికి ఉపయోగపడుతుంది.ఇది నాన్-స్టిక్ కోటింగ్‌తో వస్తుంది.

కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు.దీని ధర రూ.15,990.ఇక ఎకో 4వ జెన్ అనే స్మార్ట్ స్పీకర్ చాలా ఉపయోగపడుతుంది.

డాల్బీ ప్రాసెసింగ్, అలెక్సా-ఎనేబుల్డ్ హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్‌తో వచ్చే పవర్‌ఫుల్ స్పీకర్ ఇది.దీనిలో ఇన్-బిల్ట్‌గా ఆఫర్ చేసిన జిగ్‌బీ హబ్ అనేక స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కనెక్ట్ చేయడానికి, నియంత్రించడానికి మీకు హెల్ప్ అవుతుంది.దీని ధర రూ.9,999.

Telugu Philipsair, Smart-Latest News - Telugu

MI 360° హోమ్ సెక్యూరిటీ వైర్‌లెస్ కెమెరా 2K ప్రో అనేది మరొక స్మార్ట్‌హోమ్ డివైజ్‌.2304 x 1296 వరకు రిజల్యూషన్‌తో ఇది వీడియోలను రికార్డ్ చేస్తుంది.ప్రైవసీ కోసం లెన్స్‌ను క్రిందికి తిప్పగల సామర్థ్యం ఇందులో అందించారు.ఈ కెమెరా ధర రూ.4,499.చివరగా, రియల్‌మీ స్మార్ట్ ప్లగ్‌లు WiFi ద్వారా మీ హోమ్ అప్లయెన్సెస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి.

గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా ద్వారా వాయిస్ కమాండ్స్ ఇస్తూ కూడా రియల్‌మీ స్మార్ట్ ప్లగ్‌లను నియంత్రించవచ్చు.దీని ధర రూ.799.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube