Sai Pallavi :సాయి పల్లవి విషయంలో అన్ని రూమర్స్ మాత్రమే !

సాయి పల్లవి.గత వారం రోజులుగా ఎక్కడ చూసినా ఒక వార్త వైరల్ గా మారింది.

 These All Are Rumors About Sai Pallavi-TeluguStop.com

ఆమె కమర్షియల్ గా విజయం సాధించిన వారసుడు, తెగింపు సినిమాలను వద్దని రిజెక్ట్ చేసింది అంటూ సదరు వార్తల సారాంశం.ఏంటో ఈ పిచ్చి వార్తలు కానీ ఇవన్నీ ఎలా సృష్టించ బడతాయి అనే విషయం ఒక పట్టాన అర్థం కాదు.

మన సోషల్ మీడియా, వెబ్ సైట్స్ ఎప్పుడు ఏ వార్తను ఎలా వండి వడ్డిస్తారో తెలియదు కానీ పనికి రాని విషయాలను బాగానే ముందట వేస్తారు.సాయి పల్లవి( Sai pallavi ) తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఆమె కమర్షియల్ సినిమాలు ఇప్పటివరకు చేయలేదు అన్నట్టు మన మీడియా చెప్పే విషయాలను బట్టి చూస్తే ఒక ఇంత నవ్వు రాక తప్పదు.

Telugu Ajith Kumar, Dhanush, Kollywood, Maari, Rashmika, Rumor, Sai Pallavi, Tol

గతంలో ధనుష్ తో మారి 2 అంటూ పక్కా కమర్షియల్ సినిమా సాయి పల్లవి చేసిన విషయం కూడా అందరూ గుర్తుంచుకోవాలి.ఈ సినిమాలో రౌడీ బేబీ పాట రికార్డులకు ఎక్కిన విషయం కూడా తెలిసింది మరి వారసుడు, తెగింపు సినిమాలను సాయి పల్లవి రిజెక్ట్ చేసి అవకాశం అస్సలు లేనేలేదు.ఆమె గత సినిమాలు కొన్ని వరాజయం పాలు అవ్వడంతో నిశ్శబ్దంగా ఉంది కాబట్టి అన్ని సినిమాలను రిజెక్ట్ చేస్తుందని దాని అర్థం కాదు.

ఆచితూచి అడుగులు వేయడంలో సాయి పల్లవి తరువాతే ఎవరైనా.ఆమెతో సినిమా చేయాలంటే ఆమె కండిషన్స్ కి సినిమా యూనిట్ ఒప్పుకొని తీరాలి.అయితే వారసుడు, తెగింపు సినిమాల విషయంలో మాత్రం అలా జరగలేదు.ఇది పూర్తిగా ఒక గాసిప్ మాత్రమే.

విజయ్ లాంటి ( Vijay ) ఒక స్టార్ హీరో సినిమాలో నటించమంటే సాయి పల్లవి నో అనే ఛాన్స్ లేదు అలా అని ఆ సినిమాలో తన హద్దులు కూడా ముందే చెబుతుంది.తన హద్దుల ప్రకారమే విజయ్ నటించే అవకాశాలు ఉన్నాయి.

అజిత్ విషయం( Ajith Kumar )లో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.

Telugu Ajith Kumar, Dhanush, Kollywood, Maari, Rashmika, Rumor, Sai Pallavi, Tol

ఇక ప్రస్తుతం ఆమె ఏ సినిమా నటిస్తున్న విషయం బయటకు తెలియడం లేదు సినిమాలు చేస్తుందా ఆపేస్తుందా అన్న క్లారిటీ కూడా లేదు.సినిమాల కోసం చదువును పక్కకు పెట్టిన సాయి పల్లవి ఇప్పుడు సినిమాలను కూడా పక్కన పెట్టడం కూడా పెద్ద విషయమేమీ కాదు.అందుకే సాయి పల్లవి వంటి హీరోయిన్స్ విషయంలో గాసిప్స్ క్రియేట్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి.

తనకు సినిమాల్లో అవకాశం లేకపోతే ఒక క్లినిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాను అని గతంలో సాయి పల్లవి అనౌన్స్ చేసిన విషయం కూడా తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube