ఈ 8 వస్తువులను మనం ఇతరులతో అస్సలు షేర్ చేసుకోకూడదు..! ఎందుకో తెలుసా.?  

These 8 Things Do Not Share With Others-telugu Viral News,viral Things

మన చిన్నతనం నుంచే మన తల్లిదండ్రులు అనేక విషయాలను మనకు చెబుతారు.నేర్పిస్తారు.అలాంటి వాటిల్లో ఒకటి షేరింగ్‌.ఎవరితోనైనా మన దగ్గర ఉన్న వస్తువులను షేర్‌ చేసుకోవాలని వారు చెబుతారు.

These 8 Things Do Not Share With Others-Telugu Viral News

అలాగే మనం చేస్తాం.అయితే వేరే ఏ వస్తువులు అయినా కావచ్చు కానీ.

కొన్ని రకాల వస్తువులను మాత్రం మనం ఎప్పుడూ ఇతరులతో షేర్‌ చేసుకోరాదు.అవును, మీరు విన్నది కరెక్టే.కొన్ని రకాల వస్తువులను మనం మన వ్యక్తిగతంగా వాడుకోవాలి.కానీ వాటిని ఇతరులకు ఇవ్వరాదు.అయితే అది వాస్తు కోసమే, మరేదైనా ఇతర విషయం కోసమో కాదు.మన ఆరోగ్యం కోసం.మనం ఆరోగ్యంగా ఉండాలంటే.కింద చెప్పిన ఈ వస్తువులను మనమే వాడాలి.ఇతరులతో షేర్‌ చేసుకోరాదు.అలాంటి వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

These 8 Things Do Not Share With Others-Telugu Viral News

1.తల కోసం వాడేవి
మనం తల కోసం వాడే బ్రష్‌లు, టోపీలు, దిండ్లు, దువ్వెనలను ఇతరులతో షేర్‌ చేసుకోరాదు.

వాటిని ఇతరులకు ఇవ్వరాదు.అలాగే ఇతరులు వాడే ఈ వస్తువులను మనం తీసుకోరాదు.

ఎందుకంటే వారి జుట్టులో ఏదైనా ఇన్‌ఫెక్షన్‌ ఉంటే అది మనకు సోకుతుంది.మనకు ఉంటే అవతలి వారికి సోకుతుంది.అలాగే పేలు వంటివి వ్యాప్తి చెందుతాయి.కనుక వీటిని ఇతరులకు ఇవ్వరాదు.

2.క్రీములు
స్కిన్‌ కేర్‌ కోసం వాడే పర్సనల్‌ మాస్క్‌లు, సీరమ్స్‌, ఫేస్‌ క్రీములు ఎవరికి చెందినవి వారే వాడాల్సి ఉంటుంది.

ఇతరులవి వాడరాదు.వాడితే వారి స్కిన్‌లో ఉండే బాక్టీరియా మనకు కూడా వ్యాప్తి చెందుతుంది.

దీంతో చర్మ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.ముఖ్యంగా చర్మంపై ర్యాషెస్‌, దద్దుర్లు, దురద, ఎగ్జిమా, సోరియాసిస్‌ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

కనుక ఈ వస్తువులను వాడరాదు.

3.దుస్తులు
అండర్‌వేర్‌, సాక్సులు, దుస్తులు కూడా ఒకరివి మరొకరు వాడరాదు.వీటితో కూడా బాక్టీరియా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది.

వీటితో ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.కనుక ఈ ఐటమ్స్‌ పట్ల కూడా జాగ్రత్త వహించాలి.

4.దంత సంరక్షణకు వాడేవి
దంత సంరక్షణకు వాడే ఫ్లాస్‌, టూత్‌ పిక్‌లు, టూత్‌ బ్రష్‌లు వంటి వస్తువులను ఒకరు వాడేవి మరొకరు వాడరాదు.

వీటితో ఇ.కోలి బాక్టీరియా వ్యాప్తి చెందుతుంది.అది మన జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్లను కలిగిస్తుంది.దీంతో విష జ్వరాలు వస్తాయి.అసలు ఎవరైనా ఈ వస్తువులను 3 నెలలకు మించి వాడరాదు.వాటితే ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు.

5.షేవింగ్‌ రేజర్స్‌
సాధారణంగా చాలా మంది షేవింగ్‌ చేసుకునే రేజర్స్‌ను ఒకరు వాడినవి మరొకరు వాడతారు.

అయితే అలా చేయకూడదు.ఎవరి రేజర్స్‌ వారే వాడాల్సి ఉంటుంది.ఒక కుటుంబంలో ఉన్న సొంత కుటుంబ సభ్యులు అయినా సరే జాగ్రత్త తీసుకోవాలి.ఎందుకంటే వీటి ద్వారా హెపటైటిస్, హెచ్‌ఐవీ వైరస్‌లు సంక్రమించేందుకు అవకాశం ఉంటుంది.

అవి వస్తే ఎంతటి ప్రాణాంతక పరిణామాలు దాపురిస్తాయో అందరికీ తెలిసిందే.కనుక ఈ వస్తువులు వాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించాల్సిందే.

6.ప్యూమిస్‌ స్టోన్స్‌
పాదాలపై ఉండే మృత చర్మ కణాలను పోగొట్టి అక్కడి చర్మాన్ని మృదువుగా చేసుకునేందుకు పాదాల సంరక్షణ కోసం చాలా మంది ప్యూమిస్‌ స్టోన్స్‌ వాడుతారు.

అయితే వీటిని కూడా ఎవరు వాడేవి వారే వాడాలి.లేదంటే వీటి ద్వారా ఫంగస్‌ వ్యాప్తి చెందవచ్చు.దాంతో పాదాల మీద, కాలి వేళ్ల మధ్యలో పుండ్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

7.ఇయర్‌ బడ్స్‌, ఇయర్‌ ఫోన్స్‌
ఇయర్‌ బడ్స్‌ ఏమో గానీ సాధారణంగా చాలా మంది ఇయర్‌ ఫోన్స్‌ ఒకరు వాడేవి మరొకరు తీసుకుని వాడుతుంటారు.ఇలా అస్సలు వాడకూడదు.ఎవరు వాడే ఇయర్‌ ఫోన్స్‌ వారే వాడాలి.లేదంటే అవతలి వారి చెవుల్లో ఉండే బాక్టీరియా మనకు వ్యాప్తి చెంది మన చెవుల్లో ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.

కనుక ఈ వస్తువులను వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.

8.చెప్పులు

చెప్పులు, షూస్‌ వంటివి కూడా ఇతరులు వేసుకునేవి మనం వేసుకోరాదు.ఎవరి చెప్పులు, షూస్ వారే వాడాలి.లేదంటే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.అందరూ పాదాలను సరిగ్గా సంరక్షించుకుంటారని గ్యారంటీ ఉండదు.కనుక వీటిని షేర్‌ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి.

తాజా వార్తలు

These 8 Things Do Not Share With Others-telugu Viral News,viral Things Related....