చాణక్య నీతి: ఈ ముగ్గురికీ మేలు చేస్తే మ‌న‌కి కీడు జ‌రుగుతుంది

ఇతరులకు మంచి చేయడం వల్ల మ‌న‌కి మంచి జరుగుతుందని సాధారణంగా అంద‌రూ భావిస్తారు.కానీ అది అన్ని చోట్లా వ‌ర్తించ‌దు.

 These 3 People Also Remain Unhappy ,unhappy ,chanakya Neeti , Women, Foolish Wom-TeluguStop.com

చాణక్యుడు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మ‌న‌కు స‌మాజంలో క‌నిపించే మూడు ర‌కాల వ్య‌క్తుల‌కు స‌హాయం చేయ‌డం ద్వారా మ‌న‌కు కీడు క‌లుగుతుంది.అందుకే అటువంటివారికి దూరంగా ఉండాల‌ని ఆచార్య చాణ‌క్య సూచించారు.మ‌రి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1.దుష్ట స్వభావం గ‌ల‌స్త్రీ

లక్షణరహితమైన, క్రూరమైన, చెడు స్వభావం క‌లిగిన‌ స్త్రీ సాహ‌చ‌ర్యంలో ఉండే పురుషుడు ఎప్ప‌టికీ ఆనందాన్ని అందుకోలేడు.అలాంటి స్త్రీలు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పురుషుల ద‌గ్గ‌ర ఉంటారు.

అటువంటి స్త్రీ పరిచయంతో ఎంత‌టివారైనా సమాజంలో, కుటుంబంలో అవ‌మాన‌పాల‌వుతారు.అందుకే అటువంటి మహిళలకు దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు.

2.అకార‌ణంగా విచారంతో ఉండేవారు

Telugu Chanakya Neeti, Foolish, Stress, Unhappy, Unrest, Waste Time-Latest News

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివ‌రాల ప్రకారం ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ అసంతృప్తితో ర‌గిలిపోతూ, ద‌క్కిన‌ ఆనందంతో తృప్తి చెందకుండా, ఎల్లప్పుడూ విలపించే వారికి దూరంగా ఉండాలి.అలాంటి వారితో కలిసి జీవించినప్పుడు మనని కూడా బాధ వెంటాడుతుంది.ఇలాంటివారు ఇతరుల సంతోషాన్ని చూసి అసూయపడి వారిని తిట్టుకుంటూ జీవిస్తారు.ఈ విధంగా ఎటువంటి కారణం లేకుండా అసూయపడుతూ ఎల్లప్పుడూ అశాంతితో ఉండే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది.

3.మూర్ఖులు

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివ‌రాల‌ ప్ర‌కారం మూర్ఖులైన‌ స్త్రీలు లేదా పురుషుల‌కు హిత‌బోధ చేయ‌కూడ‌ద‌ని ఆచార్య చాణ‌క్య తెలిపారు.మీరు మీ ప‌రిజ్ఞానం ద్వారా మూర్ఖుడికి మేలు చేయాలనుకున్నా.

అది మూర్ఖుల‌కు అర్థం కాదు.అలాంటివారు వ్యర్థంగా వాదించడం మొద‌లుపెడ‌తారు.

దీని వల్ల సమయం వృథా కావ‌డంతోపాటు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని ఆచార్య చాణ‌క్య తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube