తెరి మూవీ రీమేక్ టైటిల్ ఫిక్స్! ఏప్రిల్ లో ప్రారంభం!  

కనకదుర్గ అ టైటిల్‌తో వస్తున్న రవితేజ తెరి మూవీ రీమేక్..

Theri Telugu Remake Title Movie Confirm-mythri Movie Makers,ravi Teja,santosh Srinivas,theri Telugu Remake

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం విఐ ఆనంద్ దర్శకత్వంలో డిస్కో రాజా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో లో రవితేజకు జోడీగా పాయల్ రాజ్ పుత్, ప్రియాంక జవాల్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే...

తెరి మూవీ రీమేక్ టైటిల్ ఫిక్స్! ఏప్రిల్ లో ప్రారంభం!-Theri Telugu Remake Title Movie Confirm

ఇదిలా ఉంటే రవితేజ తాజాగా మరో సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. తమిళ సూపర్ హిట్ తెరి మూవీకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ప్రకటించినట్లు తెలుస్తుంది. కనకదుర్గ అనే టైటిల్ ను ఈ సినిమా కోసం దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి రొటీన్ కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఇది ప్రేక్షకులను ఎంతవరుకు నేర్పిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.