ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా…మనకు చిన్ననాటి ఫ్రెండే స్పెషల్, ఎందుకో తెలుసా..? 11 కారణాలు ఇవే.!

స్నేహితుడు అంటే మనకన్నా ఎక్కువగా మన గురించి ఆలోచించేవాడు, మనల్ని ఎక్కువగా ప్రేమించేవాడు.మన సామర్థ్యాన్ని గుర్తించి మనల్ని ముందుకు నడిపేవాడు.

 Theres Something So Special About Childhood Friends-TeluguStop.com

అయితే ఎంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ చిన్న నాటి దోస్తులకే మనకు ప్రత్యేకం కేజీ టు పిజీ ఎంతమందితో ఫ్రెండ్ షిప్ చేసినా… చైల్డ్ హుడ్ ఫ్రెండ్ కు మాత్రం మన మనసులో ప్రత్యేక స్థానాన్నిస్తాం.ఎన్ని బాధలున్నా ఊరెళ్లినప్పుడు వాడితో ఓ అరగంట మాట్లాడితే చాలు, అవన్ని పటాపంచలయిన ఫీలింగ్ కలుగుతుంది.

అసలెందుకు బాల్య స్నేహితులే ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకాలుగా ఉంటారో ఓ సారి చూద్దాం.

1.మనకు ఊహ తెలిసే వయసునుండీ మనతోపాటు ఉంటారు కాబట్టి.First Impression అంటారుగా అలాంటిదన్నమాట.
2.మన ప్రవర్తన ఎప్పుడు ఎలా ఉంటుందో వారికి తెలుసు.ఈ ఏజ్ లోనే మనిషి ఇష్టాఇష్టాలకు స్థిరత్వం ఏర్పడుతుంది కాబట్టి.
3.అరేయ్.ఎవ్వరికి చెప్పకురా…? అంటూ మన అన్ని సీక్రెట్స్ వాడి చెవులో చెబుతాం కాబట్టి… నాన్న జేబులో కొట్టేసిన రూపాయి దగ్గరినుండి జాతరలో కొట్టేసిన కీ చైను వరకు.
4.అబద్దాల అవసరం అంతగా ఉండదు…అంతా నిజాలే, అందరూ సత్య హరిశ్చంద్రులే.
5.స్కూల్ పేరుతో ఎక్కువ సమయం వారితోనే గడుపుతాం కాబట్టి.
6.ఆడ,మగ.పేద, ధనిక బేధాలుండవ్ కాబట్టి.

7.నచ్చకుంటే నచ్చలేదని,నచ్చితే నచ్చారని…ఉన్నది ఉన్నట్టు క్లియర్ గా చెబుతారు, దాగుడు మూతలుండవ్, నోటికొచ్చింది ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు కాబట్టి.8.అందరి ముందు మనని హీరో చేస్తాడు, మా వాడు ఈ పనిని చిటికెలో చేసేస్తాడు తెలుసా…? అంటూ పక్కోడి గాలి తీస్తాడు.9.ఎటువంటి స్వార్థం లేకుండా మనల్ని ప్రేమిస్తాడు.ఇంట్లో చేసిన సున్నుండలను జాగ్రత్తగా తీసుకొచ్చి మనతో పంచుకుంటాడు.10.కలిసి చేసే చిలిపి పనులు…క్రికెట్ ఆడుతూ ఎదురింటి అద్దాలు పగుల గొట్టడం, తోటలోని మామిడికాయలకు రాళ్ళేయడం, వాగులో ఈతకొట్టడం.11.చిన్నప్పుడు జరిగిన ఎన్నో మధురానుభూతులను ఆ ఫ్రెండ్షిప్ మద్య ఓ ధృఢమైన బాండ్ ను ఏర్పరుస్తుంది.

అయితే ఇంకెందుకు ఆలస్యం.ఇలా మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకున్న, మీరంటే అభిమానం ఉన్న ఆ బాల్య స్నేహితుడికి ఓ సారి ఫోన్ చేసి, ఆ జ్ఞాపకాలను ఓ సారి తడిమి చూసుకోండి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube