అక్క‌డ భ‌ర్త‌లు చ‌నిపోక ముందే భార్య‌లు వితంతుల‌వుతారంట‌..

మ‌న భార‌త దేశంలో అనేక ర‌కాల సాంప్ర‌దాయ‌లు, ఆచారాలు ఉన్నాయి.కాలం ఎంత అభివృద్ధి చెందుతున్నా స‌రే మ‌న సంప్ర‌దాయాలను మాత్రం ప్ర‌తి ఒక్క‌రూ పాటిస్తూనే ఉంటారు.

 There Wives Become Widows Before Their Husbands Die Details, Widows, Viral News,-TeluguStop.com

ఎంత చ‌దువుకున్నా.ఎంత ఎత్తుకు ఎదిగానా వాటిన మాత్రం ఎవ‌రూ విడిచి పెట్టరు.

అనాది కాలంగా వ‌స్తున్నా కొన్ని ఆచారాల‌ను మాత్రం ఇంకా ఆయా జాతుల్లో పాటిస్తూనే ఉంటారు.నిజానికి సాంప్ర‌దాయాలు అనేవి ప్రాంతానికి ఒక ర‌కంగా, కొన్ని వ‌ర్గాల‌కు ఒక ర‌కంగా ఉన్నాయ‌నేది అంద‌రికీ తెలిసిందే.

ఇందులో చెప్పుకోద‌గ్గ‌వి హిందూ సాంప్ర‌దాయాల గురించి.

హిందువుల్లో పెండ్లి, భ‌ర్త విష‌యంలో అనేక సంప్ర‌దాయాలు మ‌హిళ‌లు పాటిస్తారు.

భ‌ర్త నిండు నూరేళ్లు బ‌తికుండాల‌ని పూజలు, వ్రతాలు కూడా చేయ‌డం చూస్తుంటాం.అయితే భ‌ర్త బ‌తికున్న‌ప్పుడు మ‌హిళ‌ల అలంకారం ఒక‌లాగా, భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత ఒక‌లాగా ఉండ‌టం అంద‌రికీ విదిత‌మే.

భ‌ర్త చ‌నిపోతే ఎలాంటి బొట్టు, గాజులు, పూలు పెట్టుకోరు.భ‌ర్త చ‌నిపోయాక వారు వితంతువులుగా మారిపోతారు.

కానీ ఓ చోట మాత్రం భ‌ర్త బ‌తికుండ‌గానే వితంతువులు అవుతున్నారు.అయితే ఇలా ఉండ‌టానికి కార‌ణం ఏంటంటే వారి భ‌ర్త‌ల ఆయుష్షు కోస‌మే.

Telugu Widows, Gachwaha Tribe, Husbands Alive, Strange, Uttar Pradesh-Latest New

ఉత్తరప్రదేశ్ కు చెందిన‌టువంటి గచ్వాహా తెగలోని మహిళలు ఇలాంటి వింత ఆచారాన్ని పాటిస్తుంటారు.ఈ మ‌హిళ‌లు త‌మ‌కు పెండ్లి అయిన త‌ర్వాత భ‌ర్త‌ల ఆయుష్షు బాగా పెర‌గాల‌ని ఐదు నెలల వ‌ర‌కు వితంతువులుగా జీవిస్తార‌ని తెలుస్తోంది.ఇది ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉన్నా కూడా ఇదే నిజ‌మండి బాబు.అయ‌తే వీరు ప్ర‌తి ఏడాది ఒక ఐదు నెల‌లు మాత్ర‌మే ఇలా వితంతువులుగా జీవిస్తారంట‌.మిగ‌తా రోజుల్లో మామూలుగానే ఉంటార‌ని తెలుస్తోంది.ఇలా మ‌హిళ‌లు వితంతువుల‌గా ఉన్న ఐదు నెల‌ల పాటు భ‌ర్త‌లు త‌మ వృత్తి అయిన క‌ల్లు తీయ‌డానికి వెళ్తారంట‌.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube