మన భారతీయులకు ఆహారంలో భాగంగా అప్పడాలు తీసుకోవడం ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేని అంశం.అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా వీటికి ప్రేమికులు ఉన్నారనే సంగతి మీకు తెలిసినదే.
అందుకే మన భారతీయ వంటకాలలో అప్పడం అనేది ప్రధాన పాత్ర పోషిస్తోంది.ఇపుడు అదే విషయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి కొన్ని రెస్టారెంట్లు.
ముఖ్యంగా ఆకుకూర భోజనంలో పప్పుచారు.పప్పు.కూరలతో పాటు రెండు అప్పడాలు ఉండాల్సిందే.అయితే మన దగ్గర ఈ అప్పడాలు మహా అయితే ఒక్కొక్కటి 2 రూపాయల నుండి 5 రూపాయలకు మించదు.ఒక వేళ దానికి మసాలా, ఇతర ఫ్లేవర్లు యాడ్ చేసి తయారు చేస్తే 10 రూపాయిలు ఉంటుంది.
అలాంటిది అక్కడ అంటే పాశ్చాత్య దేశాల్లో ఒక్క ప్లేట్ అప్పడాలు అంటే.అందులో 5 లేదా 6 ఉంటాయి.వాటి ధర ఏకంగా 500 రూపాయలు అమ్ముతున్నారు అంటే మీరు నమ్ముతారా? మీరు విన్నది నిజమే.మలేషియాలోని ఒక రెస్టారెంట్ ‘ఆసియన్ నాచోస్’ పేరుతో వీటిని విక్రయిస్తున్నది.
సమంతా అనే వ్యక్తి ట్విట్టర్ లో ధరతో పాటు డిష్ ముద్రించిన మెనూని కూడా పంచుకోవడంతో ఈ తంతు వెలుగు చూసింది.ఈ చిత్రంలో ఒక ప్లేట్ నిండా పాపడ్స్ ఉన్నాయి.
దీనికి పక్కన అవకాడో, చింతపండు, పెళుసైన షాలోట్స్ తో ఒక బౌల్ ఇస్తారు.
వీటి ధర 27 మలేషియన్ రింగెట్, అంటే.మన ఇండియన్ రూపాయలలో రూ.512.60 అన్నమాట.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.అంతేకాకుండా మలేషియా రెస్టారెంట్ పై తీవ్ర స్థాయిలో నెటిజన్లు మండిపడుతున్నారు.కొందరు మాత్రం సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
‘ప్రతీ ప్లేట్ కు 200శాతం లాభాన్ని గడిస్తుంది ఆ హోటల్ అని ఒకరంటే, ‘నల్లచుక్కలు ఉండే పాపడాలకు ఏమాత్రం చార్జ్ వేయాలి కదా!’ అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.