సాధారణంగా కొందరి జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది.పోషకాల లోపం, హెయిర్ కేర్ లేకపోవడం, కెమికల్స్ అధికంగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడకం, ఎండ, హీట్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతూ ఉంటుంది.
చిట్లిన జుట్టును ఎన్ని సార్లు కట్ చేసినా మళ్లీ మళ్లీ అలానే జరుగుతుంటుంది.దాంతో ఏం చేయాలో అర్థం గాక తెగ సతమతమవుతుంటాయి.
అయితే కొన్ని కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే జుట్టు చివర్లు చిట్లకుండా రక్షించుకోవచ్చు.మరి ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.
జుట్టు చిట్లకుండా రక్షించడంలో విటమిన్ ఇ క్యాప్య్సూల్స్ అద్భుతంగా సహాయపడతాయి.విటమిన్ ఇ క్యాప్య్సూల్స్ ను బ్రేక్ చేసి అందులోని ఆయిల్‌ను జుట్టు చివర్లన అప్లై చేసుకోవాలి.
గంట పాటు అరనిచ్చి ఆ తర్వాత కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో హెడ్ బాత్ చేయాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు చిట్లకుండా ఉంటుంది.
జుట్టు ఆరోగ్యానికి ఆముదం ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో కేశ సంబంధిత సమస్యలను నివారించడంలోనూ ఆముదం ఉపయోగపడుతుంది.
అలాగే జుట్టు చిట్లకుండా చేయడంలోనూ ఆముదం మీకు సహాయపడుతుంది.తల స్నానం చేయడానికి అర గంట లేదా గంట ముందు జుట్టు చివర్లన ఆముదం అప్లై చేసుకోవాలి.
నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ఆలు గడ్డ రసం, ఒక స్పూన్ కలబంద జెల్ మరియు అర స్పూన్ తేనె వేసుకుని మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు చివర్లన పూసి అర గంట తర్వాత హెడ్ బాత్ చేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే జుట్టు చివర్లు చిట్లిపోకుండా ఉంటుంది.