రామ్ చరణ్ వైవాహిక జీవితంలో ఇన్ని ట్విస్ట్‌లు ఉన్నాయా.. ప్రేమ, పెళ్లి అన్నీ వేరు?

తెలుగు సినీ ఇండస్ట్రీలో.తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకోవడానికి బాగా పోరాడుతున్న నటుడు రామ్ చరణ్.

 There So Many Twists In Ram Charans Married Life Are Love And Marriage All Are D-TeluguStop.com

మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన ఈయన గురించి, ఈయన నటన గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో స్టార్ హోదాను సంపాదించుకున్నాడు చెర్రీ.

ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే రామ్ చరణ్ సినీ జీవితం పక్కనపెడితే వైవాహిక జీవితం మాత్రం బాగా ట్విస్ట్ లతో నిండి ఉంది.

చరణ్ 2007లో చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.తొలిసారి నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను సంపాదించుకున్నాడు.పైగా అభిమాన హీరోగా కూడా నిలిచాడు.ఇక ఈ సినిమా తర్వాత మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు సాధించుకొని స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు.

ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా అందులో కొన్ని ఫ్లాప్, కొన్ని హిట్ లను అందుకున్నాడు.

ఇక ఈయన 2012లో ఉపాసన కామినేనిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

కానీ ఉపాసన కంటే ముందు రామ్ చరణ్ ప్రేమ, పెళ్లి అనేది బాగా ట్విస్టులతో సాగిందట.ఇంతకీ అసలేం జరిగిందంటే.కొన్ని ఏళ్ళ కిందట రామ్ చరణ్ స్టార్ హోదాను సంపాదించుకున్నాక తన తండ్రి చిరంజీవి తనకు పెళ్లి చేయాలని అనుకున్నాడట.

Telugu Allu Arvind, Chiranjeevi, Chirutha, Love, Marrige, Neha Sharma, Ram Chara

ఆ సమయంలో అనంతపురం కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కూతురు తో పెళ్లి ఫిక్స్ అయిందని పైగా చిరంజీవి భార్య సురేఖ కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడిందట.ఇక అన్ని ఒప్పందాలు చేసుకున్నాక ఎంగేజ్మెంట్, పెళ్ళి డేట్ లు కూడా ఫిక్స్ అయ్యారని తెలిసింది.కానీ అదే సమయంలో అల్లు అరవింద్ పెళ్లిని వాయిదా వేసి పెళ్లి గురించి బయటకు రాకుండా చర్చలు చేశాడని తెలిసింది.

Telugu Allu Arvind, Chiranjeevi, Chirutha, Love, Marrige, Neha Sharma, Ram Chara

ఎందుకంటే ఆ సమయంలో చిరంజీవికి రాజకీయాలపై బాగా పట్టు ఉండటంతో అదే సమయంలో ఎన్నికలు ఉండటంతో చిరంజీవి చరణ్ పెళ్లి బిజీలో పడిపోతాడని అప్పుడు రాజకీయపరంగా అనుకున్నది సాధించలేరేమో అని వాయిదా వేయించాడట.ఒకవేళ ముఖ్యమంత్రి అయితే సీఎం కొడుకు పెళ్లి అంటూ ఇంకా ఘనంగా చెప్పవచ్చు అని అందుకే ఎలక్షన్ లు అయిపోయాక పెళ్లి చేయాలని అనుకున్నారట.

దాంతో అల్లు అరవింద్ మాటలకు చిరంజీవి కూడా ఓకే అని పెళ్లి వాయిదా వేశారట.కానీ అదే సమయంలో రామ్ చరణ్ మరో అమ్మాయి చిరుత హీరోయిన్ నేహా శర్మ తో కూడా ప్రేమ లో ఉన్నాడట.

అదే సమయంలో చిరంజీవి కుటుంబానికి ఈ విషయం తెలియడంతో ఎలక్షన్స్ ఉన్నాయని అందుకు ఇటువంటివి దరికి చేరనివ్వదు అని హెచ్చరించాడు అని తెలిసింది.

Telugu Allu Arvind, Chiranjeevi, Chirutha, Love, Marrige, Neha Sharma, Ram Chara

కానీ కొన్ని రోజుల తర్వాత పెళ్లి ఫిక్స్ చేసుకున్న అమ్మాయిని, నేహా శర్మను దూరం పెట్టి ఉపాసనతో ప్రేమలో పడ్డాడట.ఐదేళ్లు వారి మధ్య ప్రేమాయణం సాగాక తమ విషయాన్ని ఇంట్లో చెప్పి కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.ఇక రామ్ చరణ్ పెళ్లికి, లవ్ కి బాగానే ట్విస్ట్ లు ఎదురయ్యాయని తెలుస్తుంది.

ప్రస్తుతం తన తండ్రి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ లో కూడా బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మరో సినిమాకు సిద్ధంగా ఉన్నాడు చరణ్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube