తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ పార్టీ అధిష్టానం ఇక్కడ నెలకొన్న పరిస్థితి పై దృష్టి సారించి ప్రక్షాళన చేపట్టాలనే డిమాండ్ పార్టీలో పెరుగుతొంది.బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) రాజకీయ వ్యూహాలను తట్టుకుని బీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలంటే ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు ఏమాత్రం సరిపోవని, పూర్తిగా కేంద్ర బీజేపీ పెద్దలు ఇక్కడి పరిస్థితులను అంచనా వేసి, పార్టీని ప్రక్షాళన చేపట్టి, నాయకుల మధ్య సమన్వయం పెంచే విధంగా వ్యూహాలు రచిస్తేనే అది సాధ్యమవుతుందనే వాదన వినిపిస్తోంది.
ఎప్పటికప్పుడు ప్రజలను ఆకట్టుకునేందుకు కేసిఆర్ కు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తూ, పై చేయి సాధిస్తూ వస్తున్న, బిజెపి మాత్రం ఆ స్థాయిలో స్పీడ్ పెంచకపోవడంతో వెనుకబడిపోయింది అనే అభిప్రాయాలు ఆ పార్టీ నేతల్లో వ్యక్తం అవుతుంది.

ఇప్పటికే తెలంగాణ బిజెపిలో నెలకొన్న పరిస్థితులు , అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే విషయం పై బిజెపి జాతీయ కార్యదర్శి ,రాష్ట్ర సంస్థ గత ఇంచార్జి సునీల్ బన్సాల్( Sunil Bansal ) వివిధ అంశాలపై సమావేశంలో చర్చించడం తో పాటు , ముఖ్యమైన విషయాలపై అభిప్రాయ సేకరణలు చేపట్టారు.రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో ఉన్న కొంతమంది నాయకులు ఇష్టను సారంగా వ్యవహరిస్తున్నారు అని, అన్ని కార్యక్రమాలలోనూ తామే హైలైట్ అవ్వాలనే విధంగా వ్యవహరిస్తూ ఉండడం , మిగతా వారికి పెద్దగా ప్రాధాన్యం దక్కకుండా చేయడం వంటి అంశాలపై బిజెపి అధిష్టానం దృష్టికి ఫిర్యాదులు వెళ్లాయట.కీలక నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలను చక్కదిద్దితేనే పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందనే అభిప్రాయం మెజార్టీ నాయకులు వ్యక్తం చేశారట.
ఇక ఎస్సీ, ఎస్టీ ,బీసీ వర్గాలను ఆకట్టుకునే విధంగా ఎన్నికల వ్యవహాలను అమలు చేసుకుంటేనే పై చేయి సాధించగలమనే అభిప్రాయం రాష్ట్ర నాయకులు నుంచి వినిపిస్తుందట.

ఈ నేపథ్యంలో కేంద్ర బిజెపి పెద్దలు రాష్ట్ర నాయకుల అభిప్రాయాలపై విశ్లేషణ చేస్తున్నట్టు సమాచారం.ప్రస్తుతం.తెలంగాణలో ఎన్నికలకు కొద్ది నెలలు మాత్రమే ఉండడంతో, పార్టీ అధ్యక్షుడు మార్పుతో పాటు , కీలక పదవుల విషయంలో ప్రక్షాళన చేపట్టాలని నిర్ణయించుకున్నారట.
ముఖ్యంగా హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికలు కమిటీ చైర్మన్ రాజేందర్( Etela Rajender ) కు కీలక పదవి ఇచ్చే విషయంపై అధిష్టానం సానుకూలంగా ఉందంట.ప్రధాని నరేంద్ర మోది( Narendra Modi ) విదేశీ పర్యటనను ముగించుకుని స్వదేశానికి వచ్చిన తర్వాత దీనిపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకునే ఆలోచనతో బిజెపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
