పిల్లల చదువుపై తల్లిదండ్రుల ధోరణిలో మార్పు రావాలి:అదనపు కలెక్టర్ బీఎస్ లత

సూర్యాపేట జిల్లా:పిల్లలు ఉన్నతస్థాయి చదువుల్లో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమని, విద్యపట్ల వారుకూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ( Additional Collector BS Latha )సూచించారు.

హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌( Hyderabad Public School )(రామంతపూర్, బేగంపేట)లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఎస్సి విద్యార్థులకు రెండు సీట్లు కేటాయించారు.

శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు.మొత్తం 34 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో ఇద్దరు విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు.

లాటరీలో అరేంపుల లాస్యశ్రీ,ఇరిగు జెస్సికా ఎంపికయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల చదువు పట్ల తల్లిదండ్రుల ధోరణి మరాలన్నారు.

పిల్లలను శారీరకంగా ఆరోగ్యంగా పెంచాలని సూచించారు.ప్రస్తుత పరిస్థితుల్లో సెల్ ఫోన్ ప్రభావంతో పిల్లలు ఆటలకు దూరం అవుతున్నారని, ఆటలు లేకపోవడంతో శారీరక శ్రమ లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

నేటి తరుణంలో పిల్లలలో బలం లేకపోవడం దురదృష్టకరమని, అంగన్వాడిలో లభించే బలవర్ధక ఆహారంతో పాటు చిరు ధాన్యాలను అందించాలని తెలిపారు.పిల్లలను సెల్ ఫోన్ లకు దూరంగా ఉంచాలని సూచించారు.

ఈకార్యాక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి కె.లత, సోషల్ వెల్ ఫెర్ జిల్లా కో ఆర్డినేటర్ పుండారిక చారి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Suryapet News