ఏలూరు జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత

ఏలూరు జిల్లాలోని( Eluru District ) పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది.

పెంటపాడు మండలం అలంపురం పోలింగ్ కేంద్రం వద్ద డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( Deputy CM Kottu Satyanarayana ) కుమారుడు కొట్టు విశాల్ పై( Kottu Vishal ) దాడికి యత్నించారు.

అదేవిధంగా కొట్టు సత్యనారాయణపై కొందరు జనసేన నేతలు( Janasena Leaders ) కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని తెలుస్తోంది.రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దన్న విశాల్ పై జనసేన క్యాడర్ దాడికి ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే వైసీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

మరోవైపు కొక్కిరిపాడులోనూ వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వివాదం జరిగింది.ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.

Advertisement
బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు