జనాల్లో గుసగుసలు : చంద్రబాబునీ అరెస్ట్ చేస్తారా ? 

There Is Talk Among The People That There Is A Possibility Of Arresting Chandrababu

ప్రస్తుతం ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మధ్య నెలకొన్న దాడులు, అరెస్ట్ ల వ్యవహారం పెద్ద రచ్చగానే  మారిపోయింది.  ఈ విషయం లో రెండు పార్టీలు జనాల్లో సానుభూతి సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 There Is Talk Among The People That There Is A Possibility Of Arresting Chandrababu-TeluguStop.com

టిడిపి ప్రధాన కార్యాలయంపై వైసీపీ ఎన్నో సార్లు దాడులకు దిగారు అని , తమ పార్టీ నాయకులను అరెస్టు చేసి రాజకీయ కక్ష కు పాల్పడుతున్నారని,  టిడిపి అధినేత చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారు.  అంతే కాకుండా ఆయన 36 గంటల పాటు మౌన దీక్షకు దిగారు.

ఎప్పుడు ఏ విషయం పైన పెద్దగా స్పందించని ఏపీ సీఎం జగన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించారు.

 There Is Talk Among The People That There Is A Possibility Of Arresting Chandrababu-జనాల్లో గుసగుసలు : చంద్రబాబునీ అరెస్ట్ చేస్తారా  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

         తనను బూతులు తిట్టిన టిడిపి నేతలపై ఆగ్రహం చెంది, తన అభిమానులు పార్టీ నాయకులు టిడిపి కార్యాలయాలపై దాడులకు దిగారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు.

  ఈ విషయంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీదే తప్పు అని ఆయన చెప్పేశారు.ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో టిడిపిపై విమర్శలు చేస్తున్నారు.ఈ వ్యవహారం ఢిల్లీ స్థాయిలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది .కేంద్రానికి తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారం పై ఫిర్యాదు చేసింది.ఇది ఇలా ఉంటే జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి , అసభ్య పదజాలంతో దూషించిన టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి విషయంలో వైసీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించంది.ముందుగా ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించి, రాత్రి 9 గంటల సమయంలో ఆయనను అరెస్టు కూడా చేశారు.
   

Telugu Ap Cm Jagan, Cbn, Chandrababu, Chandrababu Arrest, Jagan, Lokesh, Pattabhi, People Discution, Tdp Leaders Arrest, Tdp Spoke Person-Telugu Political News

    సాధారణంగా ప్రభుత్వం పైన విమర్శలు ఎవరైనా చేస్తే ఉపేక్షించరు.అటువంటిది నేరుగా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పట్టాభి అరెస్ట్ అయ్యారు.అయితే ఈ వ్యవహారానికి అసలు సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు కాబట్టి , త్వరలో ఆయనను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు జనాల్లో మొదలయింది.ఇదే విషయాన్ని జగన్ కు అత్యంత సన్నిహితుడైన సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రస్తావించారు.

చంద్రబాబు ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికే అనేక విషయాల్లో టీడీపీ కీలక నాయకులను అరెస్ట్ చేస్తూ వస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తోంది అన్నట్లుగా వ్యవహారాలు నడుస్తుండటంతో చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని, జగన్ ఈ విషయంలో బాబు ను క్షమించే ప్రసక్తే లేదని, ఆయనను అరెస్టు చేయించి జైలుకు పంపుతారు అని చర్చ ఇప్పుడు జనాల్లో మొదలయ్యింది.

#Jagan #AP CM Jagan #Pattabhi #TDP #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube