రేవంత్ ' నాయకత్వానికి ' ఎన్ని ఇబ్బందులో ?  సొంత పార్టీలోనే ?

గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా మొదటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ముద్ర వేయించుకుంది.ఆ పార్టీలో సీనియర్ నాయకులు ఎక్కువగా ఉండడంతో, ఎవరికి వారు తాము గొప్ప నాయకులు అన్నట్లుగా వ్యవహరిస్తూ, పదే పదే గుర్తు చేస్తూ, తెలంగాణలో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.

 Dissatisfaction Among Telangana Congress Leaders Over Revanth Reddy Attitude,  R-TeluguStop.com

ఎవరికి వారు తమ నాయకత్వాన్ని సమర్థించుకుని తామే గొప్ప నాయకులు అన్నట్లుగా భావిస్తూ ఉంటారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం కోల్పోయినా,  నాయకుల పంతం  మాత్రం ఏ మాత్రం తగ్గలేదు.

ఇక కొత్తగా తెలంగాణకు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి విషయంలోనూ సీనియర్ల అసంతృప్తి ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనిపిస్తోంది.ఆయన నియామకాన్ని మొదటినుంచి వ్యతిరేకించినా, కేవలం మూడేళ్ల క్రితం పార్టీ కండువా కప్పుకొన్న రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉండడాన్ని కాంగ్రెస్ సీనియర్లు ఎవరు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

కొంతమంది.రేవంత్ విషయంలో మెత్తబడినా, ఎక్కువమంది అసంతృప్తితోనే ఉన్నారు.ఈ విషయం అనేక సందర్భాల్లో బయటపడుతూ వస్తోంది.ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బట్టి విక్రమార్క , కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వారు రేవంత్ నాయకత్వం ఇప్పటికీ ఒప్పుకోకపోగా, ఏదో ఒక సందర్భంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉన్నారు.

రేవంత్ రెడ్డి గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ ల చేరిన నేతలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారని, తాము వ్యతిరేక వర్గాన్ని ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు అని భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి వంటివారు అసంతృప్తితో ఉన్నారు.

Telugu Congress, Jeevan Reddy, Mallubatti, Pcc, Revanth Reddy, Telangana Tdp-Pol

పార్టీలో తనకు ప్రత్యర్థి అయిన రేణుక చౌదరి కి మళ్లీ యాక్టివ్ చేస్తూ,  రేవంత్ తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని బట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
  వీరే కాదు పార్టీ సీనియర్లు చాలామంది పైకి మాట్లాడకపోయినా, తమ కంటే బాగా జూనియర్ అయిన రేవంత్ నాయకత్వంలో పని చేసేందుకు ఏ మాత్రం సముఖంగా లేరట.ఈ తరహ వ్యవహారాలు రాబోయే రోజుల్లో రేవంత్ కు ఇబ్బందికరంగా మారే అవకాశం లేకపోలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube