నా అందాల్ని అమ్ముకుంటున్నాను .. అది నా ఇష్టం అంటోంది       2017-09-23   08:23:17  IST  Raghu V

హాట్ భామ పూనం పాండే రూటే సపరేటు. పబ్లిసిటి ఎలా పొందాలో, ఎక్కడ పొందాలో, అందాలు ఎలా ఆరబోయాలో, ఎంతవరకు ఆరబోయాలో, అన్ని తెలుసు పూనం కి. 2011 క్రికెట్ ప్రపంచకప్ కి ముందు పూనం ఒక అనామకురాలు. ప్రతి ఏడాది మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టే వేలమంది అమ్మాయిల్లో ఒకరు పూనం. కాని ఎప్పటికి అలానే ఉండిపోకూడదు అనుకుంది పూనం. 2011 ప్రపంచకప్ మొదలవగానే ఓ పధ్ధతి, ప్లానింగ్ ప్రకారం పబ్లిసిటి పొందింది పూనం. భారత్ ప్రపంచకప్ గెలిస్తే, గ్రౌండ్ లో అంటే గ్రౌండ్ లో, క్రికెటర్స్ యొక్క డ్రెస్సింగ్ రూమ్ లో డ్రెస్సింగ్ రూమ్ లో, ఎక్కడ అంటే అక్కడ పూర్తి నగ్నంగా పోజులు ఇస్తానని అనౌన్స్ చేసింది పూనం. భారత్ క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. మాట మార్చలేదు పూనం. ఖచ్చితంగా నగ్న ప్రదర్శన చేస్తాను అంది. బీసిసిఐ అస్సలు ఒప్పుకోలేదు. నగ్న ప్రదర్శన జరక్కపోతే ఏం, పూనం మాత్రం ఫేమస్ అయిపొయింది.

మధ్యలో కొన్ని బాలివుడ్ హాట్ సినిమాలు చేసినా, ఎందుకో పూనం రాణించలేదు. అయితేనేం, సోషల్ మీడియాను వేదికగా చేసుకొని చేయాల్సిదంతా చేస్తోంది పూనం. రోజూ టిఫిన్, లంచ్, డిన్నర్ వడ్డించి పెట్టినట్లు, రోజు కుర్రాళ్ళ కోసం తన అందాల్ని సోషల్ మీడియాలో వడ్డించడం పనిగా పెట్టుకుంది. ఆ క్రేజునే క్యాష్ చేసుకుంటే పూనం పాండే యాప్ ని తయారుచేసి, దాంట్లో తన హాట్ హాట్ ఫోటోలు ఎప్పట్టికప్పుడు అప్లోడ్ చేస్తూ, లక్షలు సంపాదిస్తోంది పూనం. ఇదేమి తప్పుగా అనిపించట్లేదా అని అడిగితె, అస్సలు అనిపించదు అంటోంది.

సినిమాల్లో హీరోయిన్లు చేసే పనే తను యాప్ లో సోషల్ మీడియాలో చేస్తునాన్ను, అందాలు ఉన్నప్పుడు అమ్ముకోవడంలో తప్పేంటి? కొందరు శరీరాన్ని అమ్ముకొని వ్యభిచారం చేస్తారు. నేను అలా ఏమి చేయడం లేదుగా, కేవలం నా గ్లామర్ ని వాడుకుంటున్నాను అంటూ తనని తానూ సపోర్ట్ చేసుకుంది పూనం.