కొల్లాపూర్ లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న సమయంలోనే తెలంగాణ ఏర్పడిందని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారన్న కేసీఆర్ ఇందిరమ్మ రాజ్యంలో దరిద్రం తప్ప ఏం లేదని విమర్శించారు.ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీఆర్ పార్టీ ఎందుకు పెడతారని ప్రశ్నించారు.ఎన్టీఆర్ రూ.2 కిలో బియ్యం పథంక పెట్టే వరకూ ఆకలి చావులు లేవా అని నిలదీశారు.ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారో చెప్పాలన్నారు.ఈ క్రమంలో తెలంగాణ బతుకు దెరువు పోరాటం కోసం ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.