ఆ గ్రామాలలో ఒక్క కరోనా కేసు లేదు.. అసలు కారణం ఏంటంటే..?!

దేశ వ్యాప్తంగా కరోనా రెండవ సారి విజృంభన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకవైపు రోజురోజుకి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కంటే భారత దేశంలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుంటే, మరో వైపు ఆక్సిజన్ సరైన సమయానికి  అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

 There Is Not A Single Corona Case In Those Villages What Is The Real Reason , No-TeluguStop.com

ఇలా వివిధ రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతుంటే, ఆ రాష్ట్రంలోని రెండు గ్రామాలలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు అవ్వలేదు.అందుకు ముఖ్య కారణం ఆ రెండు గ్రామాలలో కఠిన నిబంధనలు నిష్టగా పాటించడమే.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… గుజరాత్ రాష్ట్రం లోని షియాల్ అలియా అనే గ్రామాలలో ఇప్పటివరకు కూడా ఒక కరోనా కేసు కూడా నమోదు అవ్వలేదు.అమ్రేలి జిల్లాలో షియాల్ అనే గ్రామంలో కఠిన కరోనా నిబంధనలు పాటిస్తూ ఉండడంతో ఆ  గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు అవలేదు.

  అంతేకాకుండా బయట వ్యక్తులు అని ఎవరిని కూడా ఆ గ్రామస్తులు ఊరిలోకి రానివ్వకుండా కఠిన నిబంధనలు పాటిస్తున్నారు.అంతేకాకుండా గ్రామస్తులు అందరికీ నిత్యం మాస్క్ లు పంపిణి అలాగే ఎప్పటికి కప్పుడు ఊరిని మొత్తం శానిటైజ్ చేస్తున్నారు.

అలాగే ఊరి వ్యక్తులు ఎవరూ కూడా బయటికి వెళ్లకుండా, ఏదైనా అత్యవసరం అయితే ఆ ఊరి సర్పంచ్ దగ్గర పర్మిషన్ అడిగి బయటికి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లి వచ్చాక అనంతరం  కూడా క్వారంటైన్ లో ఉండాలి.

ఇలా కఠిన ఆంక్షలు పాటించడం వల్ల వారి గ్రామానికి కరోనా సోకలేదని షియాల్ గ్రామ సర్పంచ్ హమీర్ భాయ్ తెలియచేస్తున్నారు.

అలాగే బరూచ్ జిల్లాలోని గ్రామం అలియా.

ఈ గ్రామ జనభా మొత్తం 500 మంది మాత్రమే.ఈ గ్రామ ప్రజలు కూడా కరోనా కఠిన నిబంధనలు పాటించడం వల్లే  ఇప్పటివరకు గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు అవ్వలేదు అంటూ గ్రామస్థులు తెలుపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube