టీడీపీ కంచుకోటలో వైసీపీకి నాయ‌కుడే క‌రువ‌య్యాడా...!

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం టీడీపీకి పట్టున్న నియోజకవర్గం.ఆ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి అంటే 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్ధులదే పైచేయి.1984, 1985, 1994, 1999, 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీదే విజయం.ఇక 1989, 2004, 2009 ఎన్నికల్లో మాత్రమే రేపల్లెలో కాంగ్రెస్ గెలిచింది.

 There Is No Ysrcp Leader In Guntur Repalle,tdp, Ysrcp, Guntur,repalle, Jagan Moh-TeluguStop.com

అయితే వైసీపీ మాత్రం ఇంతవరకు బోణి కొట్టలేదు.గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నేత అనగాని సత్యప్రసాద్‌పై ఓటమి పాలవ్వుతున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన సరే, జగన్ మోపిదేవికి తన కేబినెట్‌లో చోటు ఇచ్చారు.ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ, మంత్రి పదవి ఇచ్చారు.

కానీ అనుహ్యా పరిణామాలతో జగన్ మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో మోపిదేవి మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.దీంతో జగన్, ఆయనకు రాజ్యసభ ఇచ్చారు.ఇలా మోపిదేవి రాజ్యసభకు వెళ్ళడంతో రేపల్లెలో వైసీపీని నడిపించేదెవరనే ప్రశ్న తెరపైకి వచ్చింది.రాజ్యసభ సభ్యుడుగా ఉన్నా సరే మోపిదేవి నియోజకవర్గాన్ని బాగానే చూసుకుంటున్నారు.

కానీ నెక్స్ట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కష్టమయ్యే అవకాశాలున్నాయి.అప్పటికి ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియదు కాబట్టి, ఆయన స్థానంలో వేరే నేత బరిలో దిగాలి.

అయితే పరిస్థితులు బట్టి ఆయన పదవికి రాజీనామా చేసి పోటీ చేసే ఛాన్స్ లేకపోలేదు.

Telugu Chandra Babu, Guntur, Guntur Repalle, Mopi Devi, Repalle, Ysrcp-Telugu Po

అలా వద్దు అనుకుంటే మోపిదేవి స్థానంలో ఆయన సోదరుడు హరనాథ్ బాబు పోటీ చేయొచ్చని తెలుస్తోంది.ప్రస్తుతం నియోజకవర్గంలో ఆయన బాగా యాక్టివ్‌గా ఉంటున్నారు.అధికార నేతగా బాగానే చెలామణి అవుతున్నారు.

దీని బట్టి చూసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో రేపల్లె నుంచి మోపిదేవి సోదరుడు పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.అయితే హ‌ర‌నాథ్ బాబు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన‌గానికి పోటీ ఇచ్చేంత స్థాయి నేత కాద‌న్న టాక్ కూడా వ‌స్తోంది.

ఏదేమైనా టీడీపీకి కంచుకోట‌గా రేపల్లెలో వైసీపీ నుంచి బ‌ల‌మైన నేత‌ను జ‌గ‌న్ రంగంలోకి దింపితే త‌ప్పా ఇక్క‌డ పోటీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌నే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube