హైపర్ ఆదిపై వస్తున్న వార్తల్లో నిజం లేదట.. అదంతా ఫేక్!

బుల్లితెర లో ప్రసారం అయ్యే కామెడీ షో ల్లో జబర్దస్త్ షోకి ఉన్న పాపులారిటీ మరే ఇతర ప్రోగ్రామ్స్ కు లేదు.కొన్ని సంవత్సరాలుగా ఈ షోను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

 There Is No Truth In The News Coming Out On Hyper Adi, Hyper Aadi, Hyper Aadi Co-TeluguStop.com

ఈ షో ఎంతోమందికి కడుపు నిండా అన్నం పెడుతుంది.అంతేకాదు ఈ షో ద్వారా ఇప్పటికే టాలెంట్ ఉన్న చాలా మంది కమెడియన్లు పరిచయం అయ్యారు.

వీరి టాలెంట్ ను చూసి వెండితెర మీద కూడా అవకాశాలు వస్తున్నాయి.

ఈ షో ద్వారా ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి పరిచయ మయ్యారు.

నటనంటే ఇష్టముండి ఎంతో మంది ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న చాలా మందిని జబర్దస్త్ షో ఆదరించింది.వారిలోని మంచి నటనను వెలికితీసింది.అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు.

తన కామిడీ టైమింగ్ తో.వరస పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు.

కెరీర్ ప్రారంభంలో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి తర్వాత తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అంతే కాదు స్క్రిప్ రైటర్ గా కూడా సత్తా చాటాడు.

జబర్దస్త్ లో తన పంచులతో నవ్వించే హైపర్ ఆది వరసగా సినిమా ఆఫర్లను కూడా అందిపుచ్చు కుంటున్నాడు.అయితే ఇటీవల వివాదంలో చిక్కుకున్న హైపర్ ఆది పై దాడి జరిగిందని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

Telugu Hyper Aadi, Hyperaadi, Jabardasth, Hyper Adi, Tollywood-Movie

ఈ వివాదానికి కారణం ఆది తన తాజా స్కిట్ లో ఒక ప్రముఖ హీరోపై తనదైన శైలిలో పంచులు వర్షం కురిపించాడు.దీంతో ఆ హీరో ఫ్యాన్స్ ఆగ్రహానికి కూడా కారణం అయ్యాడు.దీంతో ఆది ఎక్కడ కనిపించిన కొడతామని హీరో అభిమానులు ఫైర్ అయినట్టుగా వార్తలు ప్రచురించ బడ్డాయి.అయితే వీరు అనడమే కాదు హైపర్ ఆది ని కొట్టారు కూడా అని ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.ఇవన్నీ ఫేక్ వార్తలని తెలుస్తుంది.

ప్రెసెంట్ ఆది ధమాకా సినిమాతో పాటు పలు షోలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube