ప్రేక్షకుల ఫ్రస్టేషన్‌.. అక్కడ ఇక్కడ ఎక్కడ సినిమాల్లేవు

కరోనా కారణంగా గత ఏడాది నుండి థియేటర్లు సరిగా రన్ అవుతున్న దాఖలాలు లేవు.తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలల పాటు కాస్త జోరుగా థియేటర్లు రన్‌ అయ్యాయి.

 There Is No Movies In Theaters And Ott Platforms , Cinema News, Corona, New Movi-TeluguStop.com

ఇంతలో మళ్లీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి.మళ్లీ ఎప్పటికి ఓపెన్‌ అయ్యోనో తెలియడం లేదు.

పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.కాని థియేటర్లు ఓపెన్‌ లేని కారణంగా అన్ని వాయిదాలు పడుతూ వస్తున్నాయి.

గత నెల నుండి వచ్చే నెల వరకు సినిమాలన్నీ కూడా వాయిదాలు పడ్డాయి.గత ఏడాది థియేటర్లు క్లోజ్ అయిన సమయంలో ఓటీటీ ద్వారా అయినా సినిమా ను విడుదల చేయడం జరిగింది.

కాని ఈ సారి మాత్రం ఓటీటీ రిలీజ్ కు మేకర్స్‌ ఆసక్తి చూపడం లేదు.ఎన్నాళ్లయినా వెయిట్‌ చేసి థియేటర్‌ రిలీజ్‌ కు వెళ్లాలని కొందరు భావిస్తుంటే మరి కొందరు మాత్రం ఓటీటీ ఇచ్చే రేటు నచ్చక విడుదలకు సిద్దం అవ్వడం లేదు.

అటు థియేటర్లు లేక.ఇటు ఓటీటీ లేక ప్రేక్షకులకు ఎంటర్‌ టైన్ మెంట్‌ కరువయ్యింది.ఓటీటీలో ఒకటి రెండు చిన్నా చితకా సినిమాలు వస్తున్నా అవి ప్రేక్షకులకు అంతగా మెప్పించే విధంగా లేవు.కనుక ఓటీటీ లో విడుదల అవుతున్న సినిమాలు భారీ బడ్జెట్‌ సినిమాలై ఉండాలని అభిమానులు ఆశ పడుతున్నారు.

కాని పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీ దారి పట్టడం లేదు.ఓటీటీ లో విడుదల చేయాలనుకున్న సినిమా లు కూడా ఇప్పుడు థియేటర్ల ఓపెన్‌ కు ఎదురు చూస్తున్నారు.

ఈ మద్య కాలంలో సినిమా లు లేక ప్రేక్షకులు ముఖ్యంగా సౌత్‌ ఆడియన్స్‌ ఫ్రస్టేషన్ తో జుట్టు పీక్కుంటున్నారట.ఒక సర్వే ప్రకారం సినిమా లు లేక పోవడంతో మనశ్శాంతి కోల్పోయాం అంటూ చాలా మంది చెప్పుకొచ్చారు.

సినిమా లు విడుదల లేక పోవడం వల్ల ప్రశాంతంగా ఉన్నామని మాత్రం 2 శాతం మంది చెప్పారట.మొత్తానికి సినిమా లు అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా లేక పోవడంతో జనాలు పిచ్చెక్కి పోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube