జేబులో డబ్బులు లేవు ... సంచిలో కుమార్తె మృతదేహం ! అలా నడుచుకుంటూ...   There Is No Money In The Pocket The Daughter Is Dead In The Bag     2018-10-19   13:46:26  IST  Sai M

తిత్లీ తుఫాన్ ప్రభావం తో ఏపీలోని శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి. ప్రస్తుతానికి ఆ ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు అందుతున్నా…నష్టం మాత్రం తీర్చలేనంతగా ఉంది. ప్రస్తుతం ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన అందరిని కలిచివేస్తోంది. ముకుంద్ దొర అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహంతో 8 కిలీమీటర్లు నడచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తిత్లీ తుఫాన్ సమయం నుంచి ముకుంద్ దొర కుమార్తె బబిత కనిపించకుండా పోయింది. తుఫాన్ సమయం వీచిన భీకర గాలులకు కొండచరియలు విరిగిపడడంతో బబిత మృతి చెందిందని నిన్న మొన్న అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేసిన అధికారులు.. మృతదేహం ఎక్కడుందో చెప్పారు.

There Is No Money In The Pocket Daughter Dead Bag-

ప్రభుత్వ పరిహారం అందాలంటే పోస్టుమార్టం తప్పనిసరి అని.. అందుకే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు. తుఫాన్ దాటికి సర్వస్వం కోల్పోయిన ముకుంద్.. వాహనం సమకూర్చుకోవడానికి డబ్బుల్లేక తన భుజాన కుమార్తె మృతదేహాన్ని ఓ సంచిలో మోసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు. మీడియా ద్వారా సమాచారం అందుకున్న అధికారులు.. అప్పటికప్పుడు వాహనం సమకూర్చారు.