అక్కడ మాస్కు ఇంపార్టెన్స్‌ను వినూత్నంగా తెలుపుతున్నారు.. ఎలాగంటే?

మన దేశంలో కరోనా తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఆ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మాస్కు ఒక్కటే దారి అని నిపుణులు పేర్కంటున్నారు.వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఇప్పటికీ అదే మాటపైన ఉన్నారు.

 There Is An Innovative Expression Of The Importance Of The Mask How-TeluguStop.com

ప్రతీ ఒక్కరు మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.కాగా, కొందరు కొవిడ్ ఫస్ట్, సెకండ్ వేవ్ అయిపోందని, ఇక ఇప్పట్లో కరోనా ముప్పు లేదని మాస్కు ధరించకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

ఈ క్రమంలో వారికి మాస్కు ఇంపార్టెన్స్ తెలిపేందుకుగాను ఈ ప్రాంతానికి చెందిన మున్సిపల్ కమిషనర్, పోలీసులు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.ఇంతకీ వారు ఏం చేస్తున్నారంటే.

 There Is An Innovative Expression Of The Importance Of The Mask How-అక్కడ మాస్కు ఇంపార్టెన్స్‌ను వినూత్నంగా తెలుపుతున్నారు.. ఎలాగంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొవిడ్ థర్డ్ వేవ్ ముంగిట్లో ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్క్ మస్ట్‌గా ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.కాగా, మాస్కులు ధరించడంపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడానికి ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కమిషనర్, పోలీసులు మాస్కు ఇంపార్టెన్స్ తెలిపేందుకుగాను వినూత్న కార్యక్రమం చేపట్టారు.వన్ పిక్చర్ స్పీక్స్ థౌజెండ్ వర్డ్స్ అన్న సూక్తి ఆధారంగా పిక్చోరియల్ రెప్రజెంటేషన్‌పైన దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలోనే గుంతకల్లు సిటీలోని అన్ని క్లాత్ షోరూం, రెడీమేడ్ దుకాణాల వద్ద ఉండే అందమైన బొమ్మలకు మాస్కులు ధరింపజేసేలా చర్యలు చేపట్టారు.

తద్వారా ‘జీవం లేని బొమ్మలే మాస్కు ధరించాయి.మీరు ఇకనైనా మాస్కు ధరించరా?’ అని ప్రశ్నిస్తున్నారు.ఇందు కోసమై ప్రతీ ఒక్క బొమ్మకు మాస్కు ధరింపజేశారు.

ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమదైన ప్రయత్నం చేస్తున్నట్లు గుంతకల్ మున్సిపల్ కమిషనర్ బండి శేశయ్య పేర్కొన్నారు.ఇకపోతే బొమ్మలకు మాస్కులు ధరింపజేయడం పట్ల అవి ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు షాపుల నిర్వాహకులు చెప్తున్నారు.

ప్రజల కోసమై ఆఫీసర్లు ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేయడం మంచి విషయమని పలువరు ఎన్జీవో ప్రతినిధులు పేర్కొంటున్నారు.కమిషనర్, పోలీసులను అభినందిస్తున్నారు.

#Guntakallu #Anantapur #Importance #Bundi Seshayya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు