Tea Stall : 60 ఏళ్లుగా శ్మశానంలో టీ స్టాల్‌.. అక్కడ ఛాయ్​ తాగితే ఇక తిరుగుండదట!

శ్మశానంలో టీ స్టాల్‌ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే.బేసిగ్గా మనం సమాధులను చూస్తే దగ్గరకు వెళ్ళడానికి కూడా ప్రయత్నించం.

 There Is A Tea Stall In The Graveyard For 60 Years , Tea Stall, 60 Yeard, Shamas-TeluguStop.com

ఎందుకంటే రకరకాల భయాలుంటాయి కాబట్టి.అయితే ఓ వ్యాపారి ఏకంగా 26 సమాధుల మధ్య టీ స్టాల్​ను విజయవంతంగా నడుపుతున్నాడు.

అలా ఒక్కటి కాదు రెండు కాదు… దాదాపు 60 సంవత్సరాలుగా అక్కడే టీ స్టాల్​ను రన్ చేస్తున్నాడు.అక్కడ టీ తాగితే అదృష్టం వరిస్తుందని అక్కడి ఖాతాదారుల విశ్వాసం.

అందుకే ఆ వ్యాపారానికి అక్కడ మంచి గిరాకీ వుంది.

ఇంతకీ అదెక్కడంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కలదు.అక్కడ స్థానికంగా వున్న ఓ శ్మశానవాటికలో ఓ ముస్లిం వ్యాపారి టీ దుకాణం నడుపుతున్నాడు.‘లక్కీ టీ స్టాల్‌’గా పేరుతో ఉన్న ఈ హోటల్‌లో సమాధులకు అటూ ఇటూ వేసిన బల్లలపై పూర్తిగా శాకాహారమే వడ్డించడం విశేషం.ఇక్కడ మొత్తం 26 సమాధులు ఉన్నాయి.టీ స్టాల్‌ సిబ్బంది రోజూ సమాధులను శుభ్రం చేసి పూలను ఉంచడం మనం చూడవచ్చు.మొదట్లో ఒక వేప చెట్టు కింద తోపుడు బండిపై టీ విక్రయించిన అబ్దుల్‌ రజాక్‌ మన్సూరీ క్రమంగా వ్యాపారం వృద్ధి చెందడంతో సమాధుల మధ్యనే టీ స్టాల్‌ను ప్రారంభించారు.

Telugu Yeard, Shamashaam, Tea Stall, Latest-Latest News - Telugu

దాదాపు 6 దశాబ్దాలుగా వారి వ్యాపారం ఎలాంటి నిరాటంకం లేకుండా సాగుతోంది.ఈ టీ స్టాల్‌కు హిందువులు, ముస్లింలనే తేడా లేకుండా అన్ని వర్గాల వారూ వస్తారు.ఈ స్టాల్‌ చూట్టూ అనేక కళాశాలలు, కార్యాలయాలు ఉండటంతో వ్యాపారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు.

ఆ టీ తాగితే అదృష్టం వరిస్తుందని నమ్మకం ఉండటంతో దూరాలనుండి కూడా కస్టమర్లు అక్కడికి వస్తుంటారని యాజమాన్యం చెబుతోంది.బన్‌ మస్కా, భారతీయ, చైనీస్‌ శాకాహార వంటలకు ఈ హోటల్‌ ప్రసిద్ధి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube