యష్ కు ఆ గండం ఉందా.. కన్నడ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోకు ప్రమాదం?

ప్రస్తుతం థియేటర్ లో కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన కే జి ఎఫ్ సినిమా తెగ సందడి చేస్తుంది.ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు ప్రస్తుతం పలు ఇండస్ట్రీలలో మారు మ్రోగుతోందనే చెప్పవచ్చు.

 Is There A Risk To Kannada Star Hero Yash Details, Hero Yash, Kollywood, Rish, F-TeluguStop.com

పార్ట్ 1 విడుదల చేసినప్పుడే ఈ సినిమా భారీ వసూళ్లు చేసుకుంది.ఇక ఇప్పుడు మాత్రం ఒక్క రోజుకే సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసుకుంది.

కేవలం కన్నడలోనే కాకుండా.హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన మంచి బ్రేక్ సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాతోనే యష్ స్టార్ హీరో రేంజ్ ను సొంతం చేసుకున్నాడు.కే జి ఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీకు మరో గుర్తింపును అందించాడు యష్.దీంతో ప్రస్తుతం కన్నడ స్టార్ హీరోగా యష్ బాగా దూసుకుపోతున్నాడు.కానీ ఓ వైపు యష్ కు గండం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అదేంటి ఆయనకు గండం ఏంటి అని అనుకుంటున్నారా.అసలు.ఆయనకే కాదు కన్నడ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలకు ఇప్పటివరకు చాలా గండాలు ఎదురయ్యాయి.ఇంతకు వాళ్ళెవరో తెలుసుకుందాం.

గత ఏడాది అక్టోబర్ లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.ఇక ఇప్పటికీ ఈ విషయాన్ని ఆయన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.

Telugu Prasanth Neel, Yash, Kgf Chapter, Kollywood, Rish, Shankar Nag, Threat Ya

కానీ ఆయన ఒక స్టార్ హోదాలో ఉండగానే ఈ లోకం నుండి దూరమయ్యారు.అంతేకాకుండా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు చిరంజీవి సర్జా కూడా గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే.ఇక ఈయన కూడా కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగి మంచి కెరీర్ సమయంలో చనిపోయారు.విష్ణు వర్ధన్ అనే మరో కన్నడ మెగాస్టార్ కూడా గుండెపోటుతో మరణించారు.

ఈయన కూడా 200 పైగా సినిమాలలో నటించి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.1990లో కన్నడ స్టార్ హీరో శంకర్ నాగ్ కూడా మంచి హోదాలో ఉన్న సమయంలోనే ఈ లోకానికి దూరమయ్యారు.ఈయన చనిపోయిన సమయంలో కూడా ఆయన సినిమాలు చాలా విడుదలయ్యాయి.ఇక మరో కన్నడ స్టార్ హీరో విజయ్ సంచారి కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.

Telugu Prasanth Neel, Yash, Kgf Chapter, Kollywood, Rish, Shankar Nag, Threat Ya

ఇక 1994లో శాండల్ వుడ్ ఛార్మింగ్ హీరో సునీల్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.అలా కన్నడ స్టార్ హీరోలంతా ఏదో ఒక గండంతో లోకాన్ని విడిచి పెట్టగా.ఇప్పుడు స్టార్ హీరోగా ఉన్న యష్ కు కూడా ఏమైనా గండం ఉంటుందా అని ఆయన అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు.

ఇప్పటికే ఈయనకు కన్నడ ఇండస్ట్రీ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా చాలా ఫాలోయింగ్ ఏర్పడింది.

ఇక దీంతో ఈయనకు కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం ఉండొచ్చేమో అని ఆయన అభిమానులు రకరకాల ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ విషయం గురించి యష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube