అక్కడ బిగ్‌బాస్‌ మొదలు.. తెలుగులో సమస్య ఇదేనా?  

There Is A Problem In Telugu From Bigboss-host,movie Updates,ntr,participants,problem,south India,telugu,బిగ్‌బాస్‌

సౌత్‌లో బిగ్‌బాస్‌ ఇప్పటికే రెండు సీజన్‌లు పూర్తి చేసుకుంది. తెలుగులో మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా, తమిళంలో హోస్ట్‌గా కమల్‌ హాసన్‌ హోస్టింగ్‌ చేశాడు. ఇక రెండవ సీజన్‌కు కమల్‌ హాసన్‌ కంటిన్యూ అవ్వగా, తెలుగులో మాత్రం నాని వచ్చాడు..

అక్కడ బిగ్‌బాస్‌ మొదలు.. తెలుగులో సమస్య ఇదేనా?-There Is A Problem In Telugu From Bigboss

ఇప్పుడు మూడవ సీజన్‌ ప్రారంభంకు అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమిళంలో హడావుడిగా మరో రెండు నెలల్లో బిగ్‌బాస్‌ సీజన్‌ 3 ప్రారంభం కాబోతుంది. అయితే ఇప్పటి వరకు తెలుగులో మాత్రం అతి గతి లేకుండా ఉంది. కమల్‌ మూడవ సీజన్‌కు హోస్ట్‌గా చేసేందుకు ఓకే చెప్పాడు.

కాని ఇప్పుడు తెలుగులో మాత్రం హోస్ట్‌ ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు.

తమిళం మరియు తెలుగులో ఒకేసారి చేయాలని భావించారు. అయితే తమిళంలో అంతా ఓకే అయినా కూడా ఇప్పటి వరకు తెలుగులో మాత్రం సెట్‌ అవ్వడం లేదు.

పార్టిసిపెంట్స్‌ ఎంపిక చేసినా కూడా హోస్ట్‌ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడంతో పార్టిసిపెంట్స్‌ ఇంకా ఫైనల్‌ చేయడం లేదు. హోస్ట్‌ ఎవరు అనే విషయం ఖరారు అయిన తర్వాత పారిస్టిసిపెంట్స్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే పార్టిసిపెంట్స్‌లో ఎవరైనా హోస్ట్‌కు దగ్గర వారు ఉన్నా లేదంటే, విరోదులు ఉన్నా కూడా అప్పుడు షో ఫార్మట్‌ దెబ్బ తింటుంది.

అందుకే హోస్ట్‌ ఎవరో అనే విషయం తేలిన తర్వాత అప్పుడు పార్టిసిపెంట్స్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు.

కాని ఇప్పుడు తెలుగు హోస్ట్‌ విషయంలో ఎలాంటి నిర్ణయంను తీసుకోలేక పోతున్నారు. ప్రతి హీరోతో సంప్రదింపులు జరుపుతున్నా కూడా ఏ ఒక్కరు కూడా ఆసక్తిని కనబర్చడం లేదు అంటూ తెలుస్తోంది. నానికి ఎదురైన ఫలితం నేపథ్యంలో ఎవరు కూడా బిగ్‌బాస్‌ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.

బిగ్‌బాస్‌లో ఎంత నిజాయితీగా హోస్టింగ్‌ చేసినా కూడా ఏదో ఒక సమయంలో విమర్శలు వస్తున్నాయి. అందుకే తమ వల్ల కాదని చాలా మంది స్టార్స్‌ అంటున్నారు. తెలుగులో మూడవ సీజన్‌ ఉంటుందా లేదా అనేది తెలియడం లేదు..

అయితే తమిళంలో మాత్రం మూడవ సీజన్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూన్‌ లేదా జులైలో సీజన్‌ ప్రారంభం కాబోతుంది.