అక్కడ పొట్టేలు, గొర్రె లకు కళ్యాణం.. ఎందుకంటే..?!

మనం సాధారణంగా మనుషుల వివాహం చూస్తూ ఉంటాం.కానీ, ఆ ఊరిలో గొర్రె, పొట్టేలకు వివాహం నిర్వహించడం వారి అనాదికాలం నుంచి ఒక ఆచారం ప్రకారం వారు వాటికి వివాహం నిర్వహిస్తున్నారు.

 There Is A Marriage For Stumps And Sheep Because Lamb, Sheep, Marraige, Andhra P-TeluguStop.com

ఆ ఊర్లో ప్రజలు మా ఊర్లో గొర్రె, పొట్టేలు వివాహానికి అందరూ ఆహ్వానితులే అంటూ అంగరంగవైభవంగా ఆ మూగజీవాలకు వివాహం జరిపించారు.అచ్చం మనిషి లాగానే వధూవరులకు అందమైన అలంకరణ చేసి సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక ప్రమిదలు వెలిగించి విశేష పూజలు నిర్వహించారు.

అంతే కాకుండా ఊరంతా సంతోషంగా ఉండాలి అంటూ శాస్త్రోక్తంగా ఆ మూగజీవాలకు వివాహం నిర్వహించారు.

ఇంతకీ ఈ వింత వివాహం ఎక్కడ నిర్వహించారు అని అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కేవీపల్లె మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో గ్రామస్థుల సమక్షంలో అనతి కాలం నుంచి ఆచారంగా వివాహాన్ని నిర్వహిస్తున్నారు.ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ తరువాత రెండు రోజులకు ఈ మూగజీవాలకు వివాహం జరిపించడం ఆ గ్రామ ప్రజల ఆనవాయితీ.ఇలా ఆ మూగజీవాలకు వివాహం జరిపిస్తే పంటపొలాలకు చీడపీడలు రాకుండా, గొర్రెలకు ఎటువంటి అంటువ్యాధులు రాకుండా ఆ ఊరి దేవత గౌరమ్మ కాపాడుతుందని ఆ గ్రామస్తుల నమ్మకం.

అంతేకాకుండా కల్యాణానికి గ్రామస్తులు అందరూ కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

గ్రామం చక్కగా ఉండడం, పంటలు కళకళలాడాలని, మూగజీవాలకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేందుకు గౌరమ్మకు కాపాడుతుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు.

అంతే కాకుండా ఇలా మూగజీవాలకు కళ్యాణం నిర్వహించడంతో వారి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గ్రామస్తులు తెలియజేస్తున్నారు.ఈ మూగజీవుల కళ్యాణం మా గ్రామానికి ఒక పెద్ద పండగ లాంటిది, మా తరం పూర్తి అయిన తర్వాత కూడా తర్వాతి తరం వాళ్లు కూడా ఇలానే మూగజీవాల వివాహం నిర్వహిస్తారని ఆ గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube