17 ఏళ్లుగా శింబు, ధనుష్ మధ్య గొడవ.. ఒకరి సినిమాల్లో ఒకరిపై ట్విస్ట్?

ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య గొడవలు, లవ్ ఎఫైర్ లు వంటివి కామన్ గా జరుగుతుంటాయి.ముఖ్యంగా గొడవలు పడితే మాత్రం వారి మధ్య దూరం అనేది పెరిగిపోతూనే ఉంటుంది.

 There Is A Clash Between Shimbu And Dhanush For 17 Years Details, Shimbu, Dhanu-TeluguStop.com

కొందరు తొందరగా కలిసిపోతే మరికొందరు కలవడానికి కూడా ఇష్టపడరు.అలా వారు ఇండస్ట్రీలో ఎంత కాలం ఉంటే అంతవరకు వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి.

కొన్ని కొన్ని సార్లు తాము గొడవ పడిన నటులతో నేరుగా వారిని ఏమనకుండా తమ సినిమాలలో ఆ నటులను ఉద్దేశించి మరీ డైలాగ్స్ కొడతారు.ఎందుకంటే నేరుగా అనడం కంటే ప్రతిసారి ఆ డైలాగు వినటం వల్ల అలా చేశామన్న ఉద్దేశం వారిలో కలుగుతుందని.

ఇదిలా ఉంటే అటువంటి గొడవనే ఇండస్ట్రీలో ఇద్దరు నటుల మధ్య జరిగింది.ఇంతకు వాళ్ళు ఎవరో కాదు నటులు శింబు, ధనుష్.

ప్రస్తుతం తమిళ స్టార్ హీరో గా, సింగర్ గా మంచి క్రేజ్ లో ఉన్న నటుడు ధనుష్.ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచాడు.ఇక ఈయన తెలుగు ఇండస్ట్రీకి కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే పరిచయం అయ్యాడు.

ఈయన కుటుంబం కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే.

ధనుష్ తండ్రి కస్తూరి రాజా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇక తన సోదరుడు సెల్వరాఘవన్ కూడా దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు.ధనుష్ నిజానికి తాను ఇంత గొప్ప స్టార్ హీరో అవుతానని ఏ రోజు కూడా అనుకోలేదు.

Telugu Aishwarya, Clash, Dhanush, Dhanush Shimbu, Kasturi Raja, Kollywood, Manma

తన చిన్నప్పుడే తనకు హీరో లక్షణాలు లేవని.సినీ ఇండస్ట్రీ పరిచయం వద్దని.ఎంత అనుకున్నా కూడా తన తండ్రి బలవంతంగా ఇండస్ట్రీలో చేరాడు.ఇక తన తండ్రి దర్శకత్వంలోనే సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.అంతే కాకుండా తన అన్న దర్శకత్వంలో కూడా చేశాడు.అలా వరుసగా తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక ఈయన మంచి హోదాలో ఉన్న సమయంలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో వివాహం చేసుకున్నాడు.వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు.కానీ కెరీర్ మొదట్లో మరో నటుడు శింబుతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.దీంతో వీరి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి.

అప్పట్లో తమిళ ఇండస్ట్రీలో శింబు ఓ వెలుగు వెలిగాడు.

Telugu Aishwarya, Clash, Dhanush, Dhanush Shimbu, Kasturi Raja, Kollywood, Manma

కానీ రాను రాను తన గర్వం మొత్తం తలకి ఎక్కడంతో సినిమాలకు దూరమయ్యాడు.ఈయన ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ధనుష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.కానీ ఇతడు గ్లామర్ పరంగా బాగా అందంగా ఉండటంతో ధనుష్ పట్ల బాగా విమర్శకుడిగా ప్రవర్తించాడు.

ధనుష్ రెండో సినిమాతో మంచి పేరు సంపాదించుకోవడంతో శింబు తను కూడా సినిమాలపై మరింత ఆసక్తి పెట్టాడు.

అదే సమయంలో మన్మధ సినిమాలో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ సినిమాలో ధనుష్ ను ఉద్దేశించి ఓ డైలాగు కూడా కొట్టాడు.

ఆ తర్వాత వచ్చిన పలు సినిమాలలో కూడా ధనుష్ ను ఉద్దేశించి కొన్ని డైలాగులు పెట్టాడు.కానీ ధనుష్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పనేమిటో తాను చూసుకున్నాడు.

Telugu Aishwarya, Clash, Dhanush, Dhanush Shimbu, Kasturi Raja, Kollywood, Manma

ఆ తర్వాత ధనుష్ కూడా తాను నటించిన సినిమాలో శింబును ఉద్దేశించి డైలాగ్ కొట్టాడు.ఆ తర్వాత శింబు మరింత రెచ్చిపోయేలా ప్రవర్తించాడు.కానీ తాను సినిమా కథల ఎంపిక విషయంలో పొరపాటు చేయటంతో సినిమాలలో అపజయాలు ఎదుర్కొన్నాడు.కానీ ధనుష్ మాత్రం ఎవరిని ఉద్దేశించి కాకుండా తన సొంత టాలెంట్ తో తాను పైకి ఎదిగాడు.

అలా 17 ఏళ్లుగా వారి మధ్య గొడవ ఉండగా ప్రస్తుతం వీరిద్దరు తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube