ఆ ఊర్లోకి పోలీసులపై నిషేధం.. కేవ‌లం ల‌వ‌ర్స్ మాత్ర‌మే వ‌స్తారంట‌..

There Is A Ban On The Police In That Town Only Lovers Will Come

మ‌నకు తెలిసినంత వ‌ర‌కు సాధార‌ణంగా ప్రేమికులు లేచిపోతే వారి త‌ల్లిదండ్రులు పోలీస్ కంప్ల‌యింట్ ఇస్తారు.ఇక పోలీసులు రంగంలోకి దిగి వారిని వెతికి ప‌ట్టుకుంటారు.

 There Is A Ban On The Police In That Town Only Lovers Will Come-TeluguStop.com

ఇక ఏదో ఒక‌ర‌కంగా త‌ల్లి దండ్రుల‌తో వారు వెళ్లే విధంగా చూడ‌టం మ‌నం అనేక క‌థ‌ల్లో వింటూనే ఉన్నాం.అయితే పోలీసులు రంగ ప్ర‌వేశం చేస్తే చాలా వ‌ర‌కు ప్రేమికులు చ‌నిపోతున్న ఘ‌ట‌న‌లు కూడా అనేకం ఉన్నాయి.

మ‌రి పోలీసులు లేక‌పోతే వారు చ‌నిపోయే అవ‌కాశం ఉండ‌దు క‌దా.ఇప్పుడు ఓ ఊరిలో ఇలాంటి విష‌య‌మే జ‌రుగుతోంది.

 There Is A Ban On The Police In That Town Only Lovers Will Come-ఆ ఊర్లోకి పోలీసులపై నిషేధం.. కేవ‌లం ల‌వ‌ర్స్ మాత్ర‌మే వ‌స్తారంట‌..-Alerts WhatsApp-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఊర్లోకి అస‌లు పోలీసులు ఎంట్రీ ఇవ్వ‌డాన్ని నిషేధించారు.

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షాన్ ఘ‌ర్ గ్రామంలో ఉండే షాంగ్చల్ మహదేవుడి ఆలయం చాలా ఫేమ‌స్‌.

అయితే ఈ గ్రామంలోకి పోలీసులు రావ‌డానికి వీలు లేదు.ఈ ఊరిలో ఉన్న ఆల‌యానికి ఎక్కువ‌గా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వారు ఎక్కువ‌గా ఈ ఆల‌యానికి వ‌స్తుంటారు.

ఈ దేవుడు వారికి అండ‌గా ఉంటార‌నే ఒక న‌మ్మ‌కం ఉంది.రాష్ట్రంలోని  న‌లుమూల‌ల నుంచి ఈ ఆయానికి ప్రేమికులు వ‌చ్చి ఇక్క‌డే పెండ్లి కూడా చేసుకుంటారు.

ఇలా పెండ్లి చేసుకున్న వారు ఈ ఆయ‌లంలోనే  ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు.

Telugu Ban, Latest, Mahadeva Temple, Shangbal-General-Telugu

వీరికి ఇక్క‌డ అన్ని ర‌కాల స‌దుపాయాలు ఉంటాయి.ఇక ఈ ఆల‌యంలో ఉన్న ప్రేమికులను ఎవ‌రు ఇబ్బంది పెట్టినా దాన్ని ఆ గ్రామ‌స్తులు మ‌హా పాపంగా ప‌రిగ‌ణిస్తారు.ఇక ఈ ఊరి వాళ్లు కూడా వారికి అన్ని విధాలుగా అండ‌గా ఉంటారు.

వారికి ఉండేందుకు కావాల్సి షెల్ట‌ర్ ఇచ్చి అతిథి మ‌ర్యాద‌లు చేస్తారు.త‌మ ఊరికి వ‌చ్చిన లవర్స్‌ని ఆదుకుంటే ఆ దేవుడి అనుగ్రహం ల‌భిస్తుంద‌ని ఈ ఊరి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.

అందుకే ఆ ఊర్లోకి పోలీసుల‌ను కూడా రానివ్వ‌కుండా నిషేధం విధించారంట‌.ఈ ఊరిలో ఉన్న ఈ ఆచారం ఏండ్లుగా కొనసాగుతోంది.

#Mahadeva Temple #Shangbal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube