బన్నీతో మరో ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లు.. ఎవరంటే?

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడుతున్నారు.అంతేకాకుండా తర్వాత ప్రాజెక్టులలో కూడా పాన్ ఇండియా కథనే ఎంచుకుంటున్నారు.

 There Are Two Pan India Directors In The Line-TeluguStop.com

ఇప్పటికే రెబల్ స్టార్ ప్రభాస్, మెగా హీరో రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పలు హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రస్తుతం ఓ పాన్ ఇండియా సినిమాలో బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‘ లో షూటింగ్ బిజీలో ఉండగా ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా టీజర్ విడుదల అవ్వగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

 There Are Two Pan India Directors In The Line-బన్నీతో మరో ఇద్దరూ పాన్ ఇండియా డైరెక్టర్లు.. ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం కోవిడ్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే పుష్ప లైన్ లోనే మరో నాలుగు సినిమాల ఆఫర్లు కూడా ఉన్నాయి.

ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు బన్నీ.కానీ కొరటాల ఎన్టీఆర్ తో ఒప్పందం చేసుకున్నందుకు బన్నీ సినిమాకు ఆలస్యం కానుంది.

ఇక గతంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా గురించి ప్రస్తుతం ఎటువంటి స్పందన లేకపోగా మరో క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నట్లు సమాచారం తెలిసిందే.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్ 2, సలార్ లో బిజీగా ఉండగా.ఈ ప్రాజెక్టు తర్వాత బన్నీతో సెట్లోకి వెళ్లనున్నాడు.ఇదిలా ఉంటే ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడట.

చాలాకాలం క్రితమే మురుగదాస్ బన్నీకి లైన్ వినిపించారని వార్తలు రాగా అప్పుడు ఈ సినిమా టేకప్ కాలేదని తెలిసింది.ఇక ప్రస్తుతం మళ్ళీ లైన్ లోకి రాగా పుష్ప సినిమా తర్వాత మురుగదాస్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

పుష్ప తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టుకు కాస్త సమయం పడుతుండటంతో ఆ గ్యాప్ లోనే మురుగదాస్ సినిమా చేయనున్నట్లు అర్థమవుతుంది

.

#PanIndia #Pushpa #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు