కేసీఆర్ కోవర్ట్ లు బీజేపీ లో ఉన్నారా ?  వారే 'లీక్ '  చేశారా ?

అన్ని విషయాల్లోనూ తమదే పైచేయిగా ఉండేలా  చేసుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రతి దశలోనూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు.అందుకే ఆయన ప్రతి విషయంలోనూ సక్సెస్ అందుకుంటూ వస్తూ ఉంటారు.

 There-are Suspicions That There Are Kcr Coverts In The Bjp Kcr, Telangana, Trs,-TeluguStop.com

ఇటీవల కేసీఆర్ స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు.  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని,  కేంద్రం ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు.

కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టిన తర్వాత రోజు కేంద్రం సంచలన ప్రకటన చేసింది.  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదంతా తమ ధర్నా కారణంగా జరిగిందని,  ఇదంతా తమ క్రెడిట్ అంటూ టిఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది అసలు ముఖ్యమంత్రి హోదాలో ధర్నా కార్యక్రమాలకు కేసీఆర్ ముందుకురావడం ,  నూతన వ్యవసాయ చట్టాల విషయంలోనూ, ధాన్యం కొనుగోలు విషయంలోనూ ధర్నాకు దిగడం,.ఆ మరుసటి రోజే కేంద్రం నుంచి దీనిపై ప్రకటన రావడం అంత యాదృచ్చికం అని భావిస్తున్నా, కొత్త వ్యవసాయ చట్టాల రద్దు నిర్ణయం ముందుగానే కేసీఆర్ కు తెలిసిందని,  అందుకే ఆయన ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకునేందుకు ఈ ధర్నాకు దిగారు అనే విషయం ఇప్పుడే బయటకు వచ్చింది.

Telugu Pcc, Revanth Reddy, Telangana, Telangana Bjp-Telugu Political News

అసలు ఇదంతా జరగడానికి కారణం బీజేపీలో కీలక స్థానాల్లో ఉన్న కేసిఆర్ కోవర్టులు కొందరు ఈ విషయాన్ని కేసీఆర్ కు చేరవేయడంతోనే , ఆయన అకస్మాత్తుగా ధర్నాకు దిగారు అనే ప్రచారం జరుగుతోంది.దీంతో ఈ వ్యవహారం బిజెపి లో చర్చకు కారణం అయింది.తెలంగాణ బీజేపీతో పాటు , కేంద్రంలోనూ కొంతమంది కెసిఆర్ కోవర్టులు ఉన్నారని , కేంద్రం తీసుకునే కీలక నిర్ణయాలను ముందుగానే వారే కేసీఆర్ కు చేర వేస్తున్నారని , అలాగే తెలంగాణ బిజెపి లో తీసుకుంటున్న కీలక నిర్ణయాలను ఇదే విధంగా బయటకు లీక్ చేస్తున్నారు అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది.దీంతో పార్టీలో ఉన్న కేసీఆర్ కోవర్ట్లు ఎవరనే విషయం తెలుసుకునేందుకు బీజేపీ తెలంగాణ నేతలు నిఘా పెట్టినట్టు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube