అక్కడ పిల్లల్ని ఎండలో వదిలేసి వెళ్లిపోతున్న తల్లులు.. ఎందుకంటే..

ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.చాలాచోట్ల వింత ఆచారాలను ప్రజలు పాటిస్తుంటారు.

 There Are Mothers Leaving Their Children In The Sun Because. Kids, Mother's, Vir-TeluguStop.com

వాటి గురించి తెలిస్తే మనం నోరెళ్లబెట్టక తప్పదు.తాజాగా అలాంటి ఒక వింత ఆచారం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందర్నీ అబ్బురపరుస్తోంది.

యూరప్ ఖండంలోని ఫిన్‌లాండ్‌ దేశంలో ఎండ కనిపిస్తే చాలు అక్కడి తల్లులు తమ పిల్లలను వెంటనే వచ్చి ఆ ఎండపొడలో కూర్చోబెడతారు.ఎండ వచ్చిందనగానే వారు హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి స్ట్రాలర్స్‌లో ఉంచిన తమ పిల్లలను ఇంటి వాకిళ్లలో ఉంచేస్తారు.

ఇంటి ముందు మాత్రమే కాదు సురక్షితమైన బహిరంగ ప్రదేశాలలో ఎక్కడ ఎండపొడ కనిపించినా అక్కడ ఉంచేస్తారు.ఆ ఎండ వేడిమి ఆస్వాదిస్తూ ఆ చంటి పిల్లలు హాయిగా నిద్ర పోతారు.

ఫిన్‌లాండ్‌లో ఇలా చేయడం శతాబ్దాలుగా ఒక ఆచారంగా సాగుతోందని స్థానికులు చెబుతున్నారు.అయితే కొందరు తల్లులు ఎండ రాగానే ఆ ఎండలో తమ పిల్లలను ఉంచాలంటూ ప్రత్యేకంగా ఆయాలను కూడా నియమించుకున్నారు.

గతంలో అయితే పిల్లలను ఎండలో వదిలేసి తల్లులు తమ పనులు తాము చేసుకునే వారట.ప్రపంచంలోని మరో దేశంలోని ప్రజలు మరొక దిమ్మతిరిగే ఆచారం కూడా పాటిస్తున్నారు.

అదే స్పెయిన్! స్పెయిన్‌ దేశంలోని ప్రజలు తమ బిడ్డల మీద నుంచి కొందరు ప్రత్యేకమైన వ్యక్తులు దూకితే.ఆ పిల్లల ఆత్మ పవిత్ర అవుతుందని విశ్వసిస్తారు.

పిల్లల పైనుంచి జంప్ చేసే ప్రత్యేకమైన వ్యక్తులు పసుపు, ఎరుపు రంగుల్లో ఉన్న బట్టలు ధరిస్తారు.అనంతరం ఇంటి వాకిళ్ళలో పడుకోబెట్టిన పిల్లల మీద నుంచి లాంగ్‌ జంప్‌ చేస్తారు.

దీని వల్ల పిల్లలను ఎలాంటి దృష్ట శక్తి, చెడి శక్తులు వేధించవని నమ్ముతారు.అలానే పిల్లలకు ఆరోగ్యం మంచిగా ఉంటుందని, వారి మనసు పవిత్రంగా తయారవుతుందని భావిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube