కలలు ఊరికే రావు, ప్రతి కల వెనుక ఓ కారణం ఉంటుంది  

ther is different types of dreams and which is different reasons - Telugu Dreams, Dreams Are Comes True, Phone Or Computer,

ప్రతి మనిషి కలలు కంటూ ఉంటాడు.రాత్రి పడుకున్న సమయంలో, పగటి పూట పడుకున్న సమయంలో కలలు వస్తాయి.

Ther Is Different Types Of Dreams And Which Is Different Reasons

తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయని మనలో కొందరి నమ్మకం.అది ఖచ్చితంగా మూడ నమ్మకమే అనేది నా మాట.కలలు ఎందుకు వస్తాయి, అసలు కలల్లో వచ్చే సంఘటనలకు మన నిజ జీవితానికి ఉన్న సంబంధం ఏంటీ అనే విషయాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయోగాలు, పరిశోదనలు నిర్వహించారు.చాలా మంది అన్నట్లుగా తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయా అనే విషయాలను కూడా తెలుసుకునేందుకు ప్రయోగాలు నిర్వహించారు.

  ఎన్నో ప్రయోగాల తర్వాత వారు తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటీ అంటే కలలు ఊరికే రావు.అయితే కలలో వచ్చింది వచ్చినట్లుగా జరగాలని ఏమీ లేదు.ఏదైనా ఒక కల వచ్చింది అంటే మీ జీవితంలో ఏదో సంఘటన జరిగింది లేదా జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు అంటూ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.ఎలాంటి కల వస్తే జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం.

కలలు ఊరికే రావు, ప్రతి కల వెనుక ఓ కారణం ఉంటుంది-General-Telugu-Telugu Tollywood Photo Image

నడి రోడ్డు మీద నగ్నంగా లేదా అర్థనగ్నంగా అందరు చూస్తు ఉండగా పరిగెడుతున్నట్లు కల వచ్చినట్లయితే మీరు జీవితంలో పెద్ద నిజాన్ని దాచి పెట్టి జీవిస్తున్నట్లుగా అర్థం.ఆ నిజం ఎక్కడ భయట పడుతుందేమో అనే భయంతో మీరు ఉంటారు, అందువల్ల మీకు అలాంటి కలలు వస్తూ ఉంటాయి.

  ఒక గదిలో మిమ్ములను బందించి ఉన్నట్లయితే లేదంటే దారి తప్పి ఎక్కడకో వెళ్తున్నట్లుగా కల వచ్చినట్లయితే మీకు చేస్తున్న ఉద్యోగం లేదా పనిపై ఆసక్తి లేనట్లుగా భావించాలి.మీ ఫోన్‌ లేదా కంప్యూటర్‌ పని చేయనట్లుగా కల వచ్చినట్లయితే మీకు నచ్చిన వ్యక్తులు, మీ దగ్గరి వ్యక్తులు మీకు దూరం అవ్వబోతున్నట్లుగా అర్థం.ఎత్తు నుండి జారి పడటం లేదా నీటిలో పడటం వంటి కలలు వచ్చినట్లయితే మీరు సమస్యను తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా అర్థం.

  మీకు బాగా తెలిసిన వారు ఎవరైనా చనిపోతే మీ జీవితంలో ఏదో కొత్త సంఘటన లేదా దశ ఎదురు కాబోతుందని భావించవచ్చు.తుఫాన్‌ వచ్చినట్లుగా పదే పదే కలలు వస్తున్నట్లయితే మీ మానసిక పరిస్థితి బాగాలేదని అర్థం.ఏదైనా భవనం కూలినట్లుగా కల వచ్చినట్లయితే మీ విలువైన వస్తువులను కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరుం ఉంది.

గుర్తు తెలియని వారు వెంటపడి మరీ కొడుతున్నట్లుగా అనిపిస్తే నిజ జీవితంలో మీరు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అర్థం.

#Dreams

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ther Is Different Types Of Dreams And Which Is Different Reasons Related Telugu News,Photos/Pics,Images..