దోమలు గర్బిణులు, ఆ బ్లడ్‌ గ్రూప్‌ వారిని ఎక్కువ కుడతాయట, ఎందుకో తెలుసా?  

Pregnancy Woman And That Blood Group More Attractive To Mosquitoes - Telugu Blood Group, Health Tips In Telugu, Mosquitoes, O +ve Blood Group Nature, Pregnancy Woman, Telugu Health Tips, Viral In Social Media

దోమలు చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిని కుడతాయని, వాటికి బేధాలు ఏమీ ఉండవని, అవి అందరి విషయంలో కూడా సామాజిక న్యాయం పాటిస్తాయంటూ అందరు అనుకుంటూ ఉంటారు.కాని దోమలు సామాజిక న్యాయం పాటించవంటూ శాస్త్రవేత్తలు నిరూపించారు.

Pregnancy Woman And That Blood Group More Attractive To Mosquitoes

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దోమలు ఎక్కువ గర్బిణీ స్త్రీలను మరియు ఎవరి శరీరం నుండి ఎక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ అంటే చెత్త కంపు వస్తుందో వారినే కుడతాయని నిరూపించారు.

తాజాగా శాస్త్రవేత్తల ప్రయోగంలో నిరూపితం అయిన ఈ అంశాలు అందరికి ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.

దోమలు గర్బిణులు, ఆ బ్లడ్‌ గ్రూప్‌ వారిని ఎక్కువ కుడతాయట, ఎందుకో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image

ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయనే విషయం ఎప్పుడో తెలుసు.కాని ఆ ఆడ దోమలు కూడా కొందరు ప్రత్యేకమైన వారిని కుట్టేందుకు అమితంగా ఆసక్తి చూపిస్తున్నాయట.

ముఖ్యంగా ‘ఓ’ బ్లడ్‌ గ్రూప్‌ వ్యక్తులను కుట్టేందుకు ఆసక్తి చూపుతాయట.బ్లడ్‌ గ్రూప్‌ దోమలకు ఎలా తెలుస్తాయనే విషయంపై శాస్త్రవేత్తలు అద్యాయనం చేయగా దోమల్లో ఉండే ప్రత్యేకమైన వాసన పీల్చే గుణంతో బ్లడ్‌ గ్రూప్‌ను గురిస్తుందని చెబుతున్నారు.

  దోమలు చర్మంపై ఉండే బాక్టీరియా నుండి వచ్చే దుర్వాసనకు ఎక్కువగా ఆకర్షితం అవుతాయట.దోమలు 160 మీటర్ల దూరంలో ఉండి చర్మంపై ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ను గుర్తిస్తాయట.మనుషులు నిద్ర పోయిన సమయంలో ఊపిరి ద్వారా ఎక్కువగా కార్బన్‌ డై ఆక్సైడ్‌ను వదులుతాం.అందుకే పగటి పూట కంటే రాత్రి సమయంలోనే మనుషులను దోమలు ఎక్కువగా కుడతాయని శాస్త్రవేత్తలు నిరూపించారు.

ఇక గర్బిణీ స్త్రీల నుండి మామూలు కంటే 25 శాతం ఎక్కువ కార్బన్‌ డై ఆక్సైడ్‌ విడుదల అవుతుందట.ఊపిరి ద్వారా వారు వదిలే కార్బన్‌ డై ఆక్సైడ్‌కు ఆకర్షితం అయిన దోమలు గర్బిణులను ఎక్కువగా కుడతాయని నిరూపించారు.

  కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఎక్కువగా వదిలే వారిని దోమలు కుడతాయని నిరూపితం అయ్యింది కనుక కాస్త జాగ్రత్తగా ఉంటే దోమల నుండి దూరంగా ఉండవచ్చు.కార్బన్‌ డై ఆక్సైడ్‌కు వ్యతిరేకంగా ఉండే ఏదైనా సువాసన వెదజల్లే పొగను ఇంట్లో వేసుకోవడం వల్ల మనుషుల దగ్గరకు దోమలు రావు.చెడు వాసన పట్టుకుని దోమలు మనుషుల వద్దకు వస్తాయి.అందుకే ప్రతి రోజు స్నానం చేస్తూ శుభ్రంగా ఉండటం వల్ల కూడా దోమల నుండి దూరంగా ఉండవచ్చు అంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు