చిరు దర్శకులకు ఏంటీ ఈ పరిస్థితి, కొరటాలకు కూడా తర్వాత ఇదే పరిస్థితా?  

What Is The Position Of Directors After Movie With Chiranjeevi-chiranjeevi 152th Movie,koratala Siva,rahul Sipligunj,ram Charan,srimukhi,surender Reddy,varun Tej,vv Vinayak

మెగాస్టార్‌ చిరంజీవితో ఖైదీ నెం.150 చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు వివి వినాయక్‌.ఆ తర్వాత ఆయన కెరీర్‌ ఏమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన కెరీర్‌ దాదాపుగా ఖతం అయ్యిందని అంటున్నారు.ఆ చిత్రం తర్వాత తెరకెక్కించిన ఒకే ఒక్క సినిమా అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.అయినా కూడా వినాయక్‌ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ప్రస్తుతానికి శీనయ్య అనే సినిమాను చేస్తున్న వివి వినాయక్‌ అందులో హీరోగా నటిస్తున్నాడు.

What Is The Position Of Directors After Movie With Chiranjeevi-chiranjeevi 152th Movie,koratala Siva,rahul Sipligunj,ram Charan,srimukhi,surender Reddy,varun Tej,vv Vinayak-What Is The Position Of Directors After Movie With Chiranjeevi-Chiranjeevi 152th Koratala Siva Rahul Sipligunj Ram Charan Srimukhi Surender Reddy Varun Tej Vv Vinayak

చిరంజీవి దెబ్బకు దర్శకత్వం వదిలేసి హీరోగా మారాడు.

ఇక సైరా నరసింహారెడ్డి చిత్రంకు దర్శకత్వం వహించిన సురేందర్‌ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు వినాయక్‌ పరిస్థితిలా అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఎందుకంటే ప్రస్తుతం ఆయనతో వర్క్‌ చేసేందుకు ఏ స్టార్‌ హీరో కూడా ఆసక్తిగా లేడు.

కారణం ఏంటో క్లీయర్‌గా అర్థం కావడం లేదు కాని సురేందర్‌ రెడ్డి సినిమా ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.సైరా సినిమా ఎఫెక్ట్‌ ఆయన కెరీర్‌పై చాలా ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం చిరంజీవి చాలా ఎక్కువగా ప్రిపరేషన్స్‌ చేసుకుంటున్నాడు.విభిన్నమైన కాన్సెప్ట్‌ అంటూ ప్రచారం జరుగుతోంది.కొరటాల శివ ఇప్పటి వరకు ఎలాంటి ఫ్లాప్స్‌ను చవిచూడలేదు.అందుకే చిరు మూవీ కూడా ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అంటున్నారు.కాని ఆ తర్వాత కొరటాల శివ కెరీర్‌ పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.

వినాయక్‌.సురేందర్‌ రెడ్డిల పరిస్థితి కొరటాలకు వస్తుందా అంటూ ఊహాగాణాలు వ్యక్తం అవుతున్నాయి.ఏం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.