మోదీ విమానానికి నో చెప్పిన పాక్

ఎప్పుడు అవకాశం దొరికినా భారత్‌పై తన అక్కసును ఏదో ఓ రూపంలో చూపుతున్న పాక్, మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది.పాక్ గగనతలం నుంచి భారత ప్రధాని మోదీ విమానానికి నో చెప్పి పాక్ మరోసారి విషం కక్కింది.

 Thepakdenies Permission To Useairwayfor Pmmodi-TeluguStop.com

సోమవారం సౌదీ పర్యటనకు వెళ్లనున్న మోదీ విమానానికి పాక్ మీదుగా వెళ్లేందుకు భారత ప్రభుత్వం అనుమతి కోరగా పాక్ ససేమిరా అన్నది.

కాశ్మీర్‌లో మానవ హక్కులు ఉల్లంఘించారనే నెపాన్ని అది ఎత్తిచూపింది.

కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత పాక్ తన గగనతలం మీదుగా భారత విమానాల ప్రయాణానికి అనుమతి నిరాకరించింది.ఈ మేరకు భారత హైకమిషనర్‌కు లిఖిత పూర్వంగా అనుమతి నిరాకరణ తెలియజేయనున్నట్లు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి ఓ ప్రకటనలో తెలిపారు.

Telugu Airway, Modi, Pakistan, Pm Modi-

కాగా సౌదీలో జరిగే బిజినెస్ పోరంలో పాల్గొనేందుకు మోదీ సోమవారం అక్కడికి వెళ్తుండగా.పాక్ కశ్మీరులకు మద్దతుగా బ్లాక్‌డేను నిర్వహిస్తోంది.పాక్ ఎప్పటికీ మారదని.ఎప్పుడూ తన వక్రబుద్దిని చాటుతూనే ఉందని, అది మరోసారి నిరూపించుకుందని రాజకీయ విశ్లేషకులు ధ్వజమెత్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube