పాక్ ఆటగాళ్ల ఆదాయానికి భారీ గండికొట్టిన పీసీబీ

పాక్ క్రికెట్ ఆటగాళ్ల ఆదాయానికి పీసీబీ భారీ గండి కొట్టింది.ప్రతి సంవత్సరం నిర్వహించే టీ10 లీగ్ క్రికెట్ ఆటలో పాక్ క్రికెటర్లకు పీసీబీ అనుమతిని నిరాకరించింది.

 Thepakcricketers Tolose Hugemoney With Pcb Refusing To-TeluguStop.com

ఆటగాళ్లకు పనిభారం ఎక్కువవుతుందనే ఉద్దేశ్యంతో పాక్ క్రికెట్ బోర్డు టీ10 లీగ్ నిర్వాహకులకు తమ మద్దతును ఉపసంహరించుకుంది.దీంతో పాక్ ఆటగాళ్లు భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోనున్నారు.

గతేదాడి టీ10 లీగ్ నిర్వాహకులు పీసీబీకి దాదాపు 6 లక్షల మిలియన్ డాలర్లు చెల్లించినట్లు తెలిపారు.కానీ ఈ ఏడాది జరగబోయే టీ10 లీగ్ పోటీల్లో పాక్ క్రికెటర్లు ఆడేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేసినప్పటికీ పీసీబీ మాత్రం అనుమతి ఇవ్వలేదు.

దీంతో పాక్ క్రికెటర్లు షోయబ్ మాలిక్, అమీర్ వంటి స్టార్ ఆటగాళ్లు వ్యక్తిగతంగా కోటి రూపాయలమేర కోల్పోనున్నారు.

ఇక భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మరాఠీ అరేబియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

నవంబర్ 11 నుంచి ఈ టీ10 లీగ్ పోటీలు ప్రారంభం కానుండగా మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి.వివిధ దేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు కూడా ఈ పొట్టి ఫార్మాట్ లీగ్‌లో పాల్గొననున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube