అప్పుడు చంద్ర‌బాబుకు ఇప్పుడు జ‌గ‌న్ కు.. ఆ పేరు త‌ప్ప‌ట్లేదే

ఏపీ రాజ‌కీయాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.అస్స‌లు ఆ ప‌ని చేయ‌బోమంటూ శ‌ప‌థాలు ప‌ట్టిన వారే చివ‌ర‌కు వెన‌కంజ వేస్తున్నారు.

 Then To Chandrababu And Now To Jagan  That Name Is Not Correct, Jagan, Chandraba-TeluguStop.com

ఒక‌ప్పుడు జ‌గ‌న్‌కు మ‌డ‌మ తిప్ప‌ను, మాట త‌ప్ప‌ను అనే వ్య‌క్తిగా ప్ర‌జ‌ల్లోకి వెళ్లారు.ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌ను తాను మ‌డ‌మ తిప్ప‌ని నేత అంటూ ప్ర‌చారం చేసుకున్నారు.

ఇక అదే స‌మ‌యంలో చంద్ర‌బాబును యూట‌ర్న్ బాబు అంటూ వైసీపీ నేత‌లు ముద్ర వేశారు.ఆయ‌న ప్ర‌త్యేక హోదా మీద యూట‌ర్న్ తీసుకున్నారని అన్ని విష‌యాల్లో ఆయ‌న యూట‌ర్న్ తీసుకుంటున్నారంటూ యూట‌ర్న్ బాబు అంటూ ముద్ర వేశారు.

అయితే ఇప్పుడు జ‌గ‌న్‌కు కూడా ఇలాంటి పేరే వస్తోంది.మ‌డ‌మ తిప్ప‌ను అన్న జ‌గ‌న్ ఇప్పుడు ప్ర‌ధాన‌మైన విష‌యాల్లో యూట‌ర్న్ తీసుకుంటున్నారు.అది కూడా ఆయ‌న ప‌ట్టుబ‌ట్టి అసెంబ్లీ తీర్మాణం చేసిన వాటి మీదే యూట‌ర్న్ తీసుకుంటున్నారు.దీంతో ఆయ‌న ఇమేజ్ డౌన్ అవుతోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఆయ‌న సీఎం అయిన తొలినాళ్లలోనే శాసనమండలి రద్దు అంటూ తీర్మానం చేసేశారు.అయితే ఈ తీర్మానం చేసిన రెండేండ్ల‌లోపే ఇప్పుడు మండలి రద్దు వద్దు అని అసెంబ్లీలో తీర్మానం పెట్టేస్తున్నారు.

Telugu Legislature, Ap Potics, Chandrababu, Jagan, Status, Tdp, Ysrcp-Telugu Pol

కేంద్రం వ‌ద్ద ఇది రెండేండ్లుగా పెండింగులోనే ఉంది కాబ‌ట్టి ఇప్పుడు ర‌ద్దు తీర్మాణాన్ని వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టు చెబుతున్నారు.ఇందుకు కార‌ణం ఆయ‌న‌కు మండ‌లిలో ఫుల్ మెజార్టీ వ‌చ్చేసింది.ఇంకోవైపు మూడు రాజ‌ధానుల బిల్ల‌ను కూడా మొన్న వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టు చెప్పేశారు.ఇలా కీల‌క‌మైన బిల్లుల‌ను పట్టుబ‌ట్టి ప్ర‌వేశ పెట్టిన జ‌గ‌న్ ఎన్ని నిర‌స‌న‌లు వినిపించినా ఇన్ని రోజులు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు.

కానీ ఇప్పుడు వ‌రుస‌గా యూట‌ర్న్ లు తీసుకుంటున్నారు.దీంతో ఆయ‌న మీద కూడా టీడీపీ నేత‌లు యూట‌ర్న్ జ‌గ‌న్ అంటూ ప్ర‌చారం చేస్తున్నారు.మొత్తానికి ఇద్ద‌రు నేత‌ల‌కు ఈ పేరు త‌ప్ప‌ట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube