అప్పుడు తిట్టారు... ఇప్పుడు  ఆ పార్టీనే దిక్కయ్యిందిగా ?

తెలంగాణలో వామపక్ష  పార్టీలైన సిపిఐ( Cpi ) సిపిఎం లకు పెద్ద చిక్కే వచ్చి పడింది.త్వరలో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని,  బీఆర్ఎస్ పొత్తులో భాగంగా తాము కోరిన సీట్లని కేటాయిస్తుందని వామపక్ష పార్టీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.

 Then They Cursed... Now That Party Is The Same, Cpi Cpm, Congress, Bjp, Brs, Tel-TeluguStop.com

గతంలో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి.ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినా,  బిజెపిని ఓడించే శక్తి కాంగ్రెస్ కు లేదని , అది కేవలం బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్( CM kcr ) కు మాత్రమే ఉందంటూ వామపక్ష పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించి కాంగ్రెస్ ను అవమానించారు.

Telugu Aicc, Congress, Cpi Cpm, India Aliance, Revanth Reddy, Telangana-Politics

ఇక మునుగోడులో మొదలైన బీఆర్ఎస్ ( BRS party )వామ పక్ష పార్టీల పొత్తు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొనసాగుతుందని నేతలు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు .అయితే కేసీఆర్ మాత్రం ఈ రెండు పార్టీలను పక్కనపెట్టి ఇటీవల అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు.ఎక్కడా వామపక్ష పార్టీలకు సీట్లు కేటాయించలేదు .కనీసం ఈ విషయంలో వామపక్ష పార్టీ నేతలకు సమాచారం కూడా ఇవ్వలేదు .దీంతో కేసీఆర్ చేసిన రాజకీయ ద్రోహం పై రెండు పార్టీల నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు.దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయంలో వామపక్ష పార్టీ నేతలు డైలమాలో పడిపోయారు.

ఈ క్రమంలోనే గతంలో తాము అవమానించిన కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఆప్షన్ గా కనిపిస్తోంది.ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జితో పార్టీ నేతలు భేటీ అయ్యారు.

తమకు మూడు స్థానాలు ఇస్తే చాలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని సీపీఐ తమకు హుస్నాబాద్,  ఇల్లందు , ఖమ్మం జిల్లాలో ఒక సీటును కేటాయించాలని కోరారు.

Telugu Aicc, Congress, Cpi Cpm, India Aliance, Revanth Reddy, Telangana-Politics

అయితే ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ( Congress )వ్యవహారాల  ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే వారికి ఏ హామీ ఇచ్చారో తెలియదు కానీ,  దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రాబోతుంది.జాతీయస్థాయిలో కమ్యూనిస్టులు ఇండియా కూటమి లో ఉన్నారు.దీంతో తెలంగాణలోనూ ఈ పొత్తు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించకపోవడం,  సొంతంగా పోటీ చేసిన గెలిచే అంత బలం లేకపోవడంతో,  కాంగ్రెస్ తమ రెండు పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించినా, సర్దుకుపోవాలన్న ధోరణితో ఈ రెండు పార్టీల నేతలు ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube