అప్పుడే ష‌ర్మిల పార్టీలో ప‌దువుల కొట్లాట‌.. అమ్ముకుంటున్నారంటూ నేత‌ల ఆరోప‌ణ‌లు!

అదేంటో గానీ ష‌ర్మిల పార్టీ పెట్టి నెల కూడా గ‌డ‌వ‌క‌ముందే పార్టీలో కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి.ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా చెప్పుకోద‌గ్గ లీడ‌ర్ కూడా లేడు గానీ ఉన్న వారే ప‌ద‌వుల‌కోసం కొట్లాడుకుంటున్నారు.

 Then There Was The Melee Of The Party In Sharmilas Party Leaders Allegations Of Selling-TeluguStop.com

ఇప్ప‌టికే పార్టీలో కోవ‌ర్టులున్నారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా సాగుతోందంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.ఇవే ష‌ర్మిల‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన‌ట్టు తెలుస్తోంది.

ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో వ‌రుస‌గా దీక్ష‌లు, ధ‌ర్నాలు చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెల్లాల‌ని, ఆ త‌ర్వాత మెల్లిగా ఇత‌ర పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను చేర్చుకోవాల‌ని ష‌ర్మిల భావిస్తున్నారు.

 Then There Was The Melee Of The Party In Sharmilas Party Leaders Allegations Of Selling-అప్పుడే ష‌ర్మిల పార్టీలో ప‌దువుల కొట్లాట‌.. అమ్ముకుంటున్నారంటూ నేత‌ల ఆరోప‌ణ‌లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఇవేవీ జ‌ర‌గ‌కుండానే పార్టీలో పదవుల‌ను కొంద‌రు పైస‌లకు అమ్మేసుకుంటున్నారని సొంత పార్టీకి చెందిన కీల‌క నేత యిన న‌ర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

ఆయ‌న ఇప్పుడు పార్టీలో చాలా కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.అలాంటి నేత‌నే ఇలా ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ష‌ర్మిల పార్టీలోనే కాదు ఈ విష‌యం కాస్తా తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింద‌నే చెప్పాలి.కీల‌కమైన ప‌ద‌వుల‌న్నింటినీ కూడా కొంద‌రు కోవ‌ర్టులు రూ.5 లక్షలకు అమ్మేసుకుంటున్నార‌ని న‌ర్సింహారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.ఆయ‌నే కాదు ఇలా చాలా మంది అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

Telugu Leaders\\' Allegations Of Selling, Narsimhareddy, Politics, Sharmila\\'s, Telangana, Then There Was The Melee Of The Party In Sharmila\\'s Party-Telugu Political News

ఇక్క‌డే ఆయ‌న మ‌రో బాంబు కూడా ఏల్చారు.ఈ మ‌ధ్య ష‌ర్మిల పార్టీలో కోవర్టులు ఎక్కువ‌య్యార‌ని, పెత్త‌నం అంతా వారిదే ఉందంటూ ఆయ‌న చెప్ప‌డం చెప్ప‌డం ఇప్పుడు ష‌ర్మిల‌ను కూడా క‌ల‌వ‌ర పెడుతోంది.రాజ‌కీయ పార్టీలో పైర‌వీలు కామ‌న్ అయినా కూడా ష‌ర్మిల పార్టీ ఇంకా ఉంద‌ని కూడా జ‌నాల్లో తెలియ‌క ముందే ఇలా లుక‌లుక‌లు ఏర్ప‌డ‌టంతో ఆమె పార్టీలోకి రావ‌డానికి కూడా ఎవ‌రూ ఇంట్రెస్ట్ చూపించ‌రు.

ఇప్ప‌టికైనా ష‌ర్మిల మేల్కొని తానే స్వ‌యంగా పార్టీ ప‌ద‌వుల విష‌యంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌ని వైఎస్ అభిమానులు భావిస్తున్నారు.

#Sharmila's #Politics #ThenThere #Narsimhareddy #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు