ఆనాడు ఎన్టీఆర్‌.. నేడు జ‌గ‌న్‌.. ఆ విష‌యంలో ఇద్ద‌రికీ ఒకే అనుభ‌వం..

Then Ntr Jagan Today Both Have The Same Experience In That Regard

ఇప్పుడు జ‌గ‌న్‌కు ఎదుర‌వుతున్న కొన్ని ఘ‌ట‌న‌లు చూస్తే ఒకప్పుడు సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎదురైన అనుభ‌వాలు గుర్తుకు రాక మాన‌వేమో.మొన్న‌టికి మొన్న మంత్రుల‌ను మార్చేస్తామ‌న్న ఘ‌ట‌న కూడా గ‌తంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ పాటించిన‌దే.

 Then Ntr Jagan Today Both Have The Same Experience In That Regard-TeluguStop.com

అయితే ఇప్పుడు మ‌రో విష‌యంలో జ‌గ‌న్ కు సీనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఎదురైన ఘ‌ట‌న‌లా అనిపిస్తోంది.అదే నండి ఉద్యోగుల విష‌యం.

ఎన్టీఆర్ హ‌యాంలో కూడా ఇలాగే ఉద్యోగులు త‌మ డిమాండ్ల సాధ‌న‌కు స‌మ్మెబాట ప‌ట్టారు.ముందుగా ఎన్టీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేసినా పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు స‌మ్మెకు దిగారు.

 Then Ntr Jagan Today Both Have The Same Experience In That Regard-ఆనాడు ఎన్టీఆర్‌.. నేడు జ‌గ‌న్‌.. ఆ విష‌యంలో ఇద్ద‌రికీ ఒకే అనుభ‌వం..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో కూడా అలాగే జ‌రుగుతోంది.కాగా ఆనాడు ఉద్యోగుల స‌మ్మెకు వ్య‌తిరేకంగా ఎన్టీఆర్ ప్ర‌జ‌ల్లో ప్ర‌చారం చేశారు.వారి మీద కొన్ని పుస్త‌కాల‌ను ముద్రించి ప్ర‌జ‌ల‌కు పంచారు.తీర్పు చెప్పాలంటూ ప్ర‌జ‌ల‌నే అడిగారు.

కాగా చివ‌ర‌కు ఇద్ద‌రూ కొంచెం త‌గ్గ‌డంతో ఆ గొడ‌వ స‌ద్దుమ‌నిగింది.ఇప్పుడు జ‌గ‌న్ హ‌యాంలో ఉద్యోగుల డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఆర్థిక స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయ‌ని చెబుతున్నారు.

కానీ ఉద్యోగులు మాత్రం అస్స‌లు త‌గ్గ‌ట్లేదు.ఏకంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని కూల్చేస్తామంటూ ప్ర‌క‌టించేస్తున్నారు.

Telugu Ap, Employees, Jagan, Senior Ntr-Telugu Political News

పీర్సీని ప‌ది రోజుల్లో ఇస్తామంటున్న జ‌గ‌న్ మాత్రం ఆ మేర‌కు నివేదిక త‌మ‌కు చూపించ‌ట్లేద‌ని ఉద్యోగులు మండిప‌డుతున్నారు.ఇక ఇదే విష‌యంలో ఉద్యోగులు చేస్తున్న ప్ర‌క‌ట‌న‌ల వెనుక ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా బ‌లంగా వినిపిస్తున్నాయి.ఇదే విష‌యాన్ని వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.మ‌రి దీనికి ముగింపు ఎప్పుడు అనే దానికి మాత్రం ఇంకా ఆన్స‌ర్ దొర‌క‌ట్లేదు.ఎన్టీఆర్ లాగే జ‌గ‌న్ కూడా స‌మ‌రానికి దిగుతారా లేక సామ‌ర‌స్యంగా వ్య‌వ‌హ‌రిస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.ఒక వేళ జ‌గ‌న్ ఉద్యోగుల డిమాండ్ల‌కు ఒప్పుకుంటే మాత్రం ఆర్థికంగా మరిన్ని స‌మ‌స్య‌లు రావ‌డం ఖాయం అని చెబుతున్నారు విశ్లేష‌కులు.

#AP #Jagan #Employees #Employees #Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube