నాడు కూలీ.. నేడు కోటీశ్వరుడు ! కారణం తెలుసుకోవాలంటే చదవాల్సిందే !     2018-10-10   20:14:54  IST  Sai M

తంతే బూరెల బుట్టలో పడ్డట్లు అన్న సామెత చందంగా అదృష్టం కలిసి రావాలే కానీ కూలీ పని చేసుకునే వాడు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయిపోవచ్చు. అది ఎలాగో ఇతగాడి గురించి తెలుసుకుంటే అర్ధం అవుతుంది. మధ్యప్రదేశ్ లోని పన్నా సమీపంలోని పట్టీ గ్రామానికి చెందిన మోతీలాల్ ప్రజాపతి(30) దినసరి కూలీ. రోజు కూలీ చేసుకుంటే గాని ఆయన కుటుంబం గడవదు. అలాంటి ప్రజాపతి ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. పన్నాలో లభించిన రెండో అతిపెద్ద వజ్రానికి ఓనర్ అయ్యాడు.

ప్రజాపతి తన లీజుకు తీసుకున్న అతి చిన్న స్థలంలో తవ్వకాలు జరుపుతుండగా 42.9 క్యారెట్ల వజ్రం బయటపడింది. ఇంకేముంది అతగాడు ఎగిరి గంతేశాడు. 1961లో పన్నాలో44.55 క్యారెట్ల వజ్రం లభించింది. ఆ త్వరాత దాదాపు అంతే బరువు ఉండే వజ్రం లభించటం ఇప్పుడే అని పన్నా డైమండ్ ఆఫీసర్ సంతోష్ సింగ్ తెలిపారు. ప్రజాపతికి దొరికిన వజ్రం దాదాపు రూ.1.50కోట్లు పలుకుందని ఆయన తెలిపారు.