అప్పుడు చింత‌మ‌డ‌క ఇప్పుడు వాసాల‌మ‌ర్రి.. కేసీఆర్‌పై సెటైర్లే సెటైర్లు!

సీఎం కేసీఆర్ ఎప్పుడూ మంచి చేయాల‌ని భావిస్తున్నా.అది కాస్తా చివ‌ర‌కు కొన్ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

 Then Chintamadaka Now Vasalamarri People Satires On Cm Kcr-TeluguStop.com

ఇప్ప‌టికే చాల విష‌యాల‌పై ప్ర‌తిప‌క్షాలు పాయింట్లు వెతికి మ‌రీ విమ‌ర్శిస్తున్నాయి.ఇక తాజాగా సీఎం కేసీఆర్ చేసిన ప‌ని మంచిదే అయినా.

అందులోకూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.అదే నండి వాసాల‌మ‌ర్రిని కేసీఆర్ ద‌త్త‌త తీసుకుని కోట్లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే.

 Then Chintamadaka Now Vasalamarri People Satires On Cm Kcr-అప్పుడు చింత‌మ‌డ‌క ఇప్పుడు వాసాల‌మ‌ర్రి.. కేసీఆర్‌పై సెటైర్లే సెటైర్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనిపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

కేసీఆర్ గ‌తంలో కూడా చింత‌మ‌డ‌క‌ను ద‌త్త‌త తీసుకుని ఇంటికి రూ.10ల‌క్ష‌లు ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం కూడా అప్ప‌ట్లో ఇదే విధంగా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.ఇందులో చెడు ఏం లేదుక‌దా అని అనుకుంటే.

రాష్ట్రంలో కేవ‌లం వాసాల‌మ‌ర్రి మాత్ర‌మే ఉందా లేదా చింత‌మ‌డ‌క మాత్ర‌మే ఉందా అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు వ‌స్తున్నాయి.వందల గ్రామాల‌కు నేటికీ రోడ్లు కూడా లేకుండా ఉంటే.

ఇప్పుడేమో వాసాల‌మ‌ర్రికి కోట్లు ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ఇక్క‌డ ఇంకో మాట కూడా కేసీఆర్ చెప్పారు.

వాసాల‌మ‌ర్రిని బంగారు గ్రామంగా తీర్చిదిద్దుతాన‌ని ప్ర‌క‌టించారు.ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ కేవ‌లం తెలంగాణను బంగారు అంటూ మాత్ర‌మే చెప్పుకొచ్చారు.

Telugu @cm_kcr, #telanganapolitics, Chintamadaka, Comments, Kcr Villages, Netizens, Rural Development, Satires On Cm Kcr, Social Media, Telangana Politics, Vasalamarri-Telugu Political News

సెప‌రేటు ఊరును బంగారుగా మారుస్తాన‌ని ప్ర‌క‌టించ‌లేదు.కానీ ఇప్పుడేమో వాసాల మ‌ర్రిని బంగారు గ్రామంగా చేస్త‌న‌ని ఆయ‌న ఇచ్చిన బంగారు తెలంగాణ నినాదాన్ని ఆయ‌నే దెబ్బేసుకోవటం పెద్ద స‌స్పెన్స్‌గా మారింది.ఇక కేసీఆర్‌కు అవ‌స‌రం ఉంటేనే ఏదైనా గ్రామాన్ని డెవ‌ల‌ప్ చేస్తారంటూ కూడా విమ‌ర్శ‌లుపెద్ద ఎత్తున వ‌స్తున్నాయి.మిగ‌తా గ్రామాల ప‌రిస్థితి కూడా ప‌ట్టించుకోవాలంటూ ఇప్ప‌టికే ఎన్నో డిమాండ్లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి.

కేసీఆర్‌కు నిజంగా గ్రామాల మీద అంత మ‌క్కువ ఉంటే అన్ని గ్రామాల‌ను డెవ‌ల‌ప్ చేయాల‌ని కోరుతున్నారు.లేదంటే ఒక‌టి రెండు గ్రామాల‌ను బంగారం చేస్తానంటే మిగ‌తా గ్రామాల‌ను చేయ‌ర‌ని ఇన్‌డైరెక్టుగా చెబుతున్నారా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

#Kcr Villages #Social Media #@CM_KCR #Chintamadaka #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు