విచిత్రంగా పంది తో బంగీ జంప్ చేయించిన థీమ్ పార్క్ నిర్వాహకులు

బంగీ జంప్ చేయడం అంటే అందరికి ఇష్టం ఉంటుంది.అయితే కొంతమంది భయపడిపోతుంటారు,మరికొందరు సరదాగా బంగీ జంప్ చేస్తూ ఉంటారు.

 Theme Park Organizers Bungee Jump With Pig-TeluguStop.com

అయితే ఈ బంగీ జంప్ జంతువులు చేస్తాయి అంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు.అయితే చైనా లో జరిగిన ఈ ఘటన విమర్శల పాలైంది.

ఒక నోరు లేని జీవి తో చైనాలో ఒక థీమ్ పార్క్ నిర్వాహకులు ఈ బంగీ జంప్ స్టంట్ ని చేయించారు.అయితే ఇంతకీ ఈ స్టంట్ లో పాల్గొన్న జంతువు ఏంటో తెలుసా, పంది.

నిజంగా ఎదో ఒక ప్రయోగం చేయాలి అని భావించిన ఆ పార్క్ నిర్వాహకులు ఇలా ఈ స్టంట్ ను మొదలు పెట్టె ముందు ఒక పంది చేత ఈ స్టంట్ చేయించారు.ఆ పందిని తాడుతో కట్టేసి 223 అడుగుల ఎత్తయిన టవర్ నుంచి కిందికి జార విడిచారు.

అనంతరం ఈ టవర్ పైకి తెచ్చారు.అది ఏమాత్రం గింజుకోకుండా మళ్ళీ ఓ పోల్ కి మరిన్ని తాళ్లతో బంధించి.

కిందికి వదిలారు.మధ్య మధ్య తాడును, పోల్ ను పైకి, కిందికీ లాగుతుంటే ఆ నోరులేని జీవి అల్లాడిపోయింది.

అయితే మరోపక్క కింద ఉన్న జనం మాత్రం ఆ మూగ జీవి బాధను ఏమాత్రం పట్టించుకోకుండా చప్పట్లు కొడుతూ తెగ వినోదం చూశారు.

Telugu Bungee Jump Pig, Pigforced, Telugu, Themepark-

అలా కొంతసేపు ఆ పందిని ఆట లాడించి చివరకు పోల్ ని పైకి లాగేసరికి అప్పటికే అది స్పృహ తప్పి దాదాపు జీవచ్ఛవంలా మారిపోయిందట.దాంతో ఆ వరాహాన్ని స్లాటర్ హౌస్ (కబేళా) కు తరలించారు.అయితే ఈ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారడం తో అనేకమంది నెటిజన్లు,జంతు కారుణ్య సంఘాలవారు థీమ్ పార్క్ నిర్వాహకులు చేసిన పనికి మండిపడుతున్నారు.

నోరులేని జీవి పట్ల ఇంత క్రూరంగా ప్రవర్తిస్తారా అని ఆగ్రహిస్తూ ట్వీట్లు చేశారు.దీనితో థీమ్ పార్క్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకున్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube