విమాన‌యానం క‌ల‌గాల‌ని మొక్కులు.. ఇదేం భ‌క్తి..!

దేశంలో ఒక్కొక్కరి భక్తి ఒక్కోలా ఉంటుంది.కొంత మంది ఎదుటి మనిషికి సాయం చేసే వ్యక్తే దేవుడు అని పూజిస్తే… కొందరు మాత్రం అలా కాకుండా గుళ్లకు వెళ్లి… తమకిష్టమైన దైవానికి మొక్కులు చెల్లిస్తుంటారు.

 Their Wish Of Fly In Airoplane .. This Is Devotion !, Flight, Temple, Temple To-TeluguStop.com

భక్తి ముసుగులో ఎంత మంది దొంగ బాబాలు పుట్టుకొచ్చినా కూడా అమాయక ప్రజలు వారి చేతుల్లో మోసపోతూనే భక్తి భావంతో మెలుగుతారు.మన పురాణాల్లో కూడా తనకు లేనిది భక్తికి అవసరం లేదని చెప్పినట్లు పెద్దలు వివరిస్తారు.

కానీ చాలా మంది అప్పులు చేసి భక్తి కోసమని చేసే చేష్టలు షాకింగ్ గా ఉంటాయి.అనేక మంది నమ్ముతూ.

పూజించే విషయాలు కూడా గమ్మత్తుగా ఉంటాయి.

పంజాబ్ లోని జలంధర్ జిల్లాలో ఉన్న తల్హన్ అనే గ్రామంలో వింతగా విమానాలయం ఉంది.

పూర్వపు రోజుల్లో షాహిద్ బాబా నిహాన్ సింగ్ గురు ద్వారాగా ఉన్న ఈ ఆలయం రాను రాను విమానాలయంగా ప్రసిద్ధి చెందింది.స్థానికులతో పాటు వేరే ప్రాంతాల నుంచి కూడా అనేక మంది వచ్చి.

ఇక్కడ ఈ విమానాలయంలో ప్రత్యే పూజలు చేస్తుంటారు.అంతే కాకుండా ఇక్కడకు పూజలు చేసేందుకు వచ్చిన వారు విమానం బొమ్మలను ముడుపుగా చెల్లిస్తూ.

ఉంటారు.

Telugu Templetown Set, Air-Latest News - Telugu

విదేశాలకు వెళ్లి స్థిరపడాలనుకునే వారే ఎక్కువగా ఈ గుడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు.ఇలా ఈ గుడిలో ప్రత్యేక పూజలు చేసి.విమానం బొమ్మను ముడుపుగా చెల్లించడం వల్ల త్వరగా విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుందనేది వారి నమ్మకం.

ఇలా ఎవరైతే విదేశాలకు వెళ్లాలని భావిస్తారో వారందరూ పంజాబ్లోని జలంధర్ జిల్లాలో కొలువై ఉన్న ఈ విమానాలయంలో ముడుపులు కడతారట.ముడుపు కట్టిన అనేక మందికి విదేశీయానం కళ నిజమయిందని ఇక్కడి స్థానికలతో పాటు పూజలు చేసేందుకు వచ్చిన వారు చెప్పడం గమానార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube