ఈట‌ల గెలుపుపైనే వారి భ‌విష్య‌త్‌.. ఓడితే ప‌రిస్థితేంటి..?

హుజూరాబాద్ ఎన్నిక‌లు గ‌త చరిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా పార్టీ దిశ‌ను మార్చేలా ఉన్నాయి.నిజానికి ఒక ఉప ఎన్నిక పార్టీ ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీస్తుందంటే ఎవ‌రూ న‌మ్మ‌లేరు.

 Their Future Depends On The Victory Of The Etala What Will Happen If They Lose,-TeluguStop.com

ఎందుకంటే పార్టీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టు ఉంటుంది.అలాంటిది ఒక్క చోట ఓడిపోయినంత మాత్రాన ప్ర‌తిష్ట ఎలా దెబ్బ తింటుంది.

దాని ప‌ట్టు ఎలా కోల్పోతుంది.కానీ ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌, బీజేపీల‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక అలాగే త‌యారయింది.

ఇక్క‌డ ఓడిపోతే త‌మ పార్టీ ప‌రువు పోతుంద‌న్న రేంజ్‌లో కేసీఆర్ రాజ‌కీయాలు చేస్తున్నారు.

ఇంకోవైపు త‌న ఇర‌వై ఏండ్ల రాజ‌కీయ భ‌విష్య‌త్‌, అలాగే ఎదుగుతున్న బీజేపీ ప్ర‌తిష్ట ఈ ఎన్నిక‌తోనే ముడిప‌డి ఉంద‌న్న రేంజ్‌లో ఈట‌ల రాజేంద‌ర్ ఎలాగైనా గెలిచేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే ఒక్క ఈట‌ల రాజేంద‌ర్ గెలుపుతో ఆయ‌న భ‌విష్య‌త్ మాత్ర‌మే కాదు ఆయ‌న వెంట న‌డిచి టీఆర్ ఎస్‌కు గుడ్ బై చెప్పిన వారి భ‌విష్య‌త్ అలాగే ఇప్పుడు హుజూరాబాద్ లో ఆయ‌న గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్న వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ కూడా ఆధార‌ప‌డిఉంది.ఈట‌ల రాజీనామా చేసిన వెంట‌నే ఏనుగు మ‌నోహ‌ర్‌రెడ్డి, తుల ఉమ లాంటి కీల‌క నేత‌లు కూడా ఈట‌ల వెంటే న‌డిచారు.

Telugu Enugumanohar, Etala Rajender, Etela Huzurabad, Huzurabad, Kcr, Raghunanda

వీరే కాదు అప్ప‌టికే బీజేపీలో ఉన్న బొడిగె శోభ‌, ర‌ఘునంద‌న్‌రావు, ఇంకా కొంద‌రు ముఖ్య నేత‌లు కూడా ఇప్పుడు ఈట‌ల గెలుపు కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.అయితే వీరంతా కూడా ఉద్య‌మంలో క‌లిసి ప‌నిచేసిన వారే.ఇక ఈట‌ల రాజేంద‌ర్ గెలిస్తే గ‌న‌క తామంతా ఒక టీమ్ లాగా ఏర్ప‌డి బీజేపీలో ఎద‌గొచ్చ‌నే ప్ర‌ణాళిక‌లో వారు ఉన్నారు.అయితే ఈట‌ల రాజేంద‌ర్ గ‌న‌క ఓడిపోతే వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ కూడా ప్ర‌మాదంలో ప‌డే ఛాన్స్ ఉంది.

ఈ విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని వారంతా కూడా ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నారు.చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube