పోలీసు అధికారి ఇంట్లో మొక్క చోరీ... దాని ధర ఎంతో తెలిస్తే?

దేశంలో ప్రతి చోట ఏదో ఒక్క దగ్గర దొంగతనాలు జరుగుతూ ఉంటాయి.ఇది సర్వసాధారణమైన విషయం.

 Theft Of A Plant In The House Of A Police Officer  What If Its Price Is Very Wel-TeluguStop.com

అంతేకాక దొంగతనాలు చాలా విచిత్రంగా ఉంటాయి.అసలు వాటిని దొంగతనం చేయాలనే ఆలోచన దొంగలకు ఎందుకు వస్తుందో కూడా మనకు అర్ధం కాకుండా ఉంటాయి.

అప్పట్లో జరిగే దొంగతనాలు పెద్ద ఎత్తున జరిగేవి.అంటే ఉదాహరణకు బంగారం, నగదు, వెండి అలా కొంచెం విలువైన వస్తువులను దొంగతనం చేయడానికి దొంగలు కూడా ఆసక్తి చూపించే వారు.

కాని ఇప్పుడు జరిగే కొన్ని దొంగతనాలను చూస్తే కడుపుబ్బా మనం నవ్వుకోక తప్పదు.

సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యం కలిగించే ఒక దొంగతనం హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటు చేసుకుంది.

జూబ్లీహిల్స్ లో నివసిస్తున్న ఓ మాజీ ఐపీఎస్ అధికారి అప్పారావు ఇంట్లో దొంగతనం చోటు చేసుకుంది.అసలు జరిగిన దొంగతనం ఏంటో తెలిస్తే ఇలాంటి వాటిని కూడా దొంగతనం చేస్తారా అని అనుకుంటారు.

ఆ ఐపీఎస్ అధికారి ఇంట్లో ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకునే సరు కవరీనా రకానికి చెందిన 15 ఏళ్ల వయసు గల బోన్సాయి మొక్కను ఎవరో ఎత్తుకు వెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఆ మొక్క ధర లక్షన్నర వరకు ఉంటుందని వారు పోలీసులకు తెలిపారు.

పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube